మీ బైక్ టైర్ ఏదైనా ట్రబుల్ ఇచ్చిందా..? దానిని తీయడానికి మీకు ఎంత సమయం పడుతుంది. దాని గురించి తెలిసినవారైతే ఓ పది నిమిషాలు.. మళ్లీ దానిని బైక్ కు ఎక్కించడానికి మరో పది నిమిషాలు.. అది సెట్ అయ్యిందో లేదో చూసుకోవాలిగా... ఎంతలేదైనా ఆ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలంటే కనీసం ఒక అద్దగంట టైం కచ్చితంగా పడుతుంది. ఇక తెలియని వారైతే గంటలు లెక్కపెట్టాల్సిందే. కానీ ఇక్కడ వీళ్లు మాత్రం కళ్లు మూసి తెరిచే లోగా.. టైర్ ను తీయడం.. కొత్త టైర్ ను ఎక్కించడం.. పెట్రోల్ నింపడం.. అన్నీ అయిపోయాయి. దీనికి నిమిషం కాదు కదా.. అర నిమిషం టైం కూడా తీసుకోలేదు. అక్కడ సమయం అత్యంత కీలకం మరి.. గంటల పాటు తీరిగ్గా చేసుకుందామంటే కుదరదు.
బైక్ టైర్ పంక్చర్ అయినా.. లేక ఏదైనా సమస్య వచ్చినా దానిని రిపేర్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కానీ ఈ మెకానిక్ లు మాత్రం కేవలం 24 సెకండ్లలోనే టైర్ ను తీసేసి.. మళ్లీ కొత్త టైర్ ను అమర్చారు. పెట్రోల్ పోసే వ్యక్తి తన పని కూడా పూర్తి చేసుకున్నాడు. ఎక్కడనుకుంటున్నారా..?
ఒక బైక్ రేసింగ్ జరుగుతున్న ప్రాంతంలో జరిగిందీ ఘటన. బైక్ రేసర్ తన బైక్ టైర్ కు ఏదో సమస్య వచ్చిందని బండిని మెకానిక్ స్టాండ్ యూనిట్ దగ్గర ఆపాడు. వాళ్లు క్షణాల్లో అక్కడకి వచ్చి.. వాళ్ల దగ్గరున్న అత్యాధునిక సామాగ్రితో చూస్తుండగానే.. టైర్ ను తీసేయడం.. మళ్లీ కొత్త టైర్ అమర్చడం జరిగిపోయాయి. మోటో అమెరికా సూపర్ బైక్ రేసర్ యాజమాన్యం ఈ వీడియోను షేర్ చేసింది. లైఫ్ ఆఫ్ టూ వీల్ అనే ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ అద్భుతాన్ని మీరూ వీక్షించండి మరి...
Published by:Srinivas Munigala
First published:January 19, 2021, 17:43 IST