Home /News /trending /

Video: హైవేపై వింత ఘటన.. డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్.. అసలేం జరిగిందంటే..

Video: హైవేపై వింత ఘటన.. డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్.. అసలేం జరిగిందంటే..

(Image-Twitter)

(Image-Twitter)

కొన్ని ఘటనలు చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణ్‌గావ్‌లో చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండా ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్ల దూరం ప్రయాణించింది.

    కొన్ని ఘటనలు చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణ్‌గావ్‌లో చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండా ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్ల దూరం ప్రయాణించింది. పుణె-నాశిక్ హైవే‌పై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే బైక్ రోడ్డు.. డ్రైవర్ లేకుండా వెళ్లడం చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

    బైక్‌పై వేగంగా వచ్చిన వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న పాదచారుడిని ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై వ్యక్తి కిందపడిపోయాడు. అయితే రైడర్ కిందపడిపోయినప్పటికీ.. బైక్ మాత్రం అలాగే ముందుకు వెళ్లింది. దాదాపు 300 మీటర్ల వరకు ప్రయాణించింది. అయితే ఆ సమయంలో బైక్‌కు ఎదురుగా ఓ వాహనం వచ్చింది. అయితే ఆ వాహనం డ్రైవర్ కూడా రైడర్ లేకుండా వస్తున్న బైక్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే బ్రేక్ వేసి వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత బైక్.. కొద్ది దూరం వెళ్లి కిందపడిపోయింది. ఇక, డ్రైవర్ లేకుండా ప్రయాణించడం చూసిన జనాలు.. దానినే చూస్తుండిపోయారు.





    ఇక, బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీ కొట్టిన ఘటనలో పాదచారుడికి తీవ్ర గాయాలు అయినట్టుగా పోలీసులు తెలిపారు. ఆ పాదచారుడిని జున్నార్‌ తాలుకాకు చెందిన 47 ఏళ్ల జనార్దన్ దత్తు గంజ్వేగా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టుగా చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Maharashtra, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు