హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కట్టుకున్న భార్యపై శాడిజం.. కూరలో ఉప్పుతక్కువైందని ఏంచేశాడో తెలుసా..?

కట్టుకున్న భార్యపై శాడిజం.. కూరలో ఉప్పుతక్కువైందని ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar: రాత్రి తన ఇంటికి వచ్చి ఆకలిగా ఉందని చెప్పాడు. దీంతో భార్య అతగాడికి అన్నంపెట్టింది. ఆ తర్వాత కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

కొందరు పెళ్లిళ్లు (Marriage)  చేసుకుని కట్టుకున్న వాళ్లని టార్చర్ పెడుతుంటారు. భార్య తరపువారు.. కట్నం ఇవ్వలేదని, బంగారం తేలేదని ప్రతిదానికి వేధిస్తుంటారు. చీటికి మాటికి కట్టుకున్న వారిని సూటిపోటీ మాటలతో (Family disputes) హింసిస్తుంటారు. మరికొందరు భార్య అందంగాలేదని, ఇతరులతో పోలుస్తుంటారు. ఇక కొందరు భార్యలు కూడా.. ఇతరులకన్నా.. తమ భర్త తక్కువగా సంపాదిస్తున్నాడని, పక్కింటి వాళ్లను, ఎదురింటి వాళ్లను చూసి తమ భర్తలను టార్చర్ పెడుతుంటారు. ఇంకొరకం ప్రబద్ధులు.. భార్య చికెన్ వండలేదని, అన్నంపెట్టలేదని దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బీహర్ లోని (Bihar) సరన్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలాన్ గ్రామానికి చెందిన బాలక్ రామ్ కుమారుడు ప్రభురామ్. ఇతను కల్లుగీత కార్మికుడు . వీరికి వినోద్ రామ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతను ఆటోను నడిపిస్తు ఉంటాడు. అయితే.. ప్రభురామ్.. రాత్రి పది తర్వాత తన ఇంటికి వెళ్లాడు. అప్పుడు తనకు ఆకలిగా ఉందని అన్నంపెట్టమని భార్యను అడిగాడు. ఆ తర్వాత.. భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది.

అయితే.. కూరలో ఉప్పులో సరిగ్గా వేయలేదని భార్యతో గొడవపడ్డాడు. కోపంలో కంట్రోల్ తప్పి భార్యను అక్కడే ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, నిందితుడి కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడి భార్యను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా (Viral news) మారింది.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ కు చెందిన ప్రమోద్ అనే  రైతుకూడా తన ఇంట్లో గేదెను ఉంచుకున్నాడు.

అదంటే రైతుకు ఎంతో ఇష్టం. అయితే... దానికి ఎన్ని దూడలు పుట్టిన రెండు మూడు నెలల్లోనే చనిపోతున్నాయి. దీంతో అతను ఎంతో బాధపడ్డాడు. తనకు ఇష్టమైన గ్రామంలోని దేవతకు తన బాధను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో గేదె మరోసారి దూడకు జన్మనించింది.

అది ఆరోగ్యంగా ఉండాలని, దానికి ఏంకావద్దని దేవతకు దండంపెట్టుకుని, గేదె తన వెంట్రులకు దూడకు మూడో ఏడాది రాగానే సమర్పిస్తాన మొక్కుకున్నాడు. అయితే... దూడకు ఏం కాలేదు. అది ఆరోగ్యంగానే ఉంది. గ్రామదేవత దయవలనే దూడబతికిందని అనుకున్నాడు. మొక్కుకున్నట్లే గ్రామ దేవత దగ్గరికి గేదెను, దూడను తీసుకొచ్చాడు. అందరి ముందే దానికి గుండు గీయించాడు. ఆ తర్వాత.. అక్కడికి వచ్చిన గ్రామస్థులకు విందుభోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  (Social media) వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Husband kill wife, VIRAL NEWS

ఉత్తమ కథలు