Bihar: ఎమ్మెల్యే తన నియోజక వర్గంలోని పెళ్లి వేడుకకు హజరయ్యారు. అక్కడ స్టేజీ మీద డ్యాన్స్ ప్రొగ్రామ్ నడుస్తోంది. డీజే మ్యూజిక్ సౌండ్ కు ఆయన రెచ్చిపోయారు.
చాలా మందికి డీజే సౌండ్ అంటే ఎంతో ఇష్టం. కొందరు తీన్మార్ బ్యాండ్ స్టార్ట్ చేయకుండానే తమకు తాముగా వెళ్ళి స్టెప్పులు వేస్తుంటారు. కొందరైతే.. ఎక్కవ పెళ్లిళ్లు జరిగిన యువకులు సందడి, మాస్ స్టెప్పులను చూసి కంట్రోల్ తప్పుతుంటారు. తామేం తక్కువ కాదంటూ.. హుషారైన స్టెప్పులు వేస్తుంటారు. కొన్ని సార్లు ఈ డ్యాన్స్ వేడుకలు వివాదస్పద మవుతుంటాయి. ఇలాంటి ఘటన ప్రస్తుతం బీహర్ లో జరిగింది.
పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) అధికార పార్టీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. తన నియోజక వర్గంలోని ఒక పెళ్లి వేడుకకు హజరయ్యాడు. అక్కడ డీజే సౌండ్ లు, తీన్మార్ స్టెప్పులను చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. ఆ తర్వాత.. తాను కూడా వెళ్లి స్టేజీమీద డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు... గోపాల్ మండల్ జనతాదళ్ యునైటేడ్ (జెడియు).. భాగల్ పూర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన నియోజక వర్గంలో ఒక పెళ్లి వేడుకకు హజరయ్యారు.
అక్కడ కొందరు అమ్మాయిలతో స్టేజీమీద డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ డీజే చప్పుడుకి గోపాల్ మండల్ (Gopal mandal) రెచ్చిపోయారు. స్టేజీమీదకు వెళ్లి యువతితో కలసి డ్యాన్స్ చేశారు. ఆమెకు పోటాపోటీగా మాస్ స్టెప్పులు వేశారు. ఆమె చేతులను పట్టుకుని, ఫ్లయింగ్ కిస్ లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం.. ఈ క్లిప్పింగ్ కాస్త వైరల్ గా మారాయి. దీంతో బీహర్ సీఎం నితీష్ కుమార్ (nitish kumar) వరకు వెళ్లింది. దీంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రతిపకాలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. అయితే, గోపాల్ మండల్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తనకు.. డ్యాన్స్ అంటే ఇష్టమని అందుకే వెళ్లి డ్యాన్స్ చేశానని తెలిపారు.
గోపాల్ మండల్ గతంలోను అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఫిబ్రవరిలో, బీహార్ ఎమ్మెల్యే ఒక వివాహ రిసెప్షన్లో బాలీవుడ్ హిట్ 'దిల్లీవాలి గర్ల్‌ఫ్రెండ్'కి డ్యాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అదే విధంగా, మండల్ గత సంవత్సరం రైలు ప్రయాణంలో తన లోదుస్తులతో తిరుగుతూ వార్తలలో నిలిచారు. ఆ సమయంలో, తనకు కడుపు నొప్పిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. తాను.. విరేచనాలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే... ప్రయాణం ప్రారంభించిన వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లాలనని తెలిపారు. అందుకే కుర్తా, పైజామాను తీసివేసి, చిన్న నెక్కర్ ఒక్కటే వేసుకొని టాయిలెట్‌కు వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డ్యాన్స్ ఘటనతో మరోసారి ఆయన వార్తలలో నిలిచారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.