• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • BIHAR STUDENT NAMES EMRAAN HASHMI SUNNY LEONE AS PARENTS ACTOR QUIPS I SWEAR HE AINT MINE READ THE STORY HERE MS

తల్లిదండ్రులైన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి, శృంగార తార సన్నీ లియోని

తల్లిదండ్రులైన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి, శృంగార తార సన్నీ లియోని

ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోని (ఫైల్)

Emraan Hashmi and suny leone: బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, శృంగార తార సన్నీ లియోని తల్లిదండ్రులయ్యారు. ఇదేదో సినిమా కోసం అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు.

 • News18
 • Last Updated:
 • Share this:
  Bollywood లో హీరోయిన్ల అదరాలతో ఆడుకునే ముద్దుల ప్రియుడు Emraan Hashmi. కిస్సింగ్ స్టార్ గా అతడికి పేరుంది. అతడి సినిమాలో పాటలు.. ఫైట్లు లేకున్నా చూస్తారేమో గానీ.. ముద్దు సీన్ లేకుంటే మాత్రం అబ్బే.. సవాలే లేదు.. దానికి ఇమ్రాన్ హష్మి కూడా ఒప్పుకోడు. అసలు బాలీవుడ్ సినిమాలలో లిప్ కిస్ లకు ఆరాధ్యుడు ఆయనే అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక శృంగార తార sunny leone గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? వెండి తెర అయినా.. బుల్లి తెర అయినా.. ఆకే తాకే చరవాణి అయినా ఆమె కనిపిస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు.

  అదేంటి..? వాళ్లిద్దరూ వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నారు కదా..? కొత్తగా తల్లిదండ్రులవడమేంటి..? ఏదైనా సినిమా కోసం అనుకుంటున్నారా..? అదైతే అస్సలు కాదు. ఇప్పటివరకు ఈ క్రేజీ జంట కాంబినేషన్ లో మూవీ రాలేదు. వస్తే ఇక థియేటర్ల ముందు పడిగాపులే. అసలు విషయానికొస్తే..

  భారత్ లో ప్రభుత్వ ఉద్యోగం అంటే కొందరికి అదొక ఆట విడుపు వంటిది. పైరవీల ద్వారా.. అక్రమ మార్గంలో ప్రభుత్వ వృత్తిలోకి ప్రవేశించి అక్కడ.. వృత్తికి సంబంధం లేని పని చేయడంలో పలువురు ఘనాపాఠీలున్నారు. అదేనండి.. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లలో ఉండే మన తారలు, సినిమా సెలబ్రిటీల పేర్లు మారుమూల సర్పంచ్ ఎన్నికల్లో దర్శనమిస్తాయి. ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే.. వీరికి సంబంధం లేకుండానే వీరి పేర్లు ఆ గ్రామాలలో ఓటర్ల లిస్టులో ఉంటాయి. అలాగే తాజాగా బీహార్ లో ఒక విద్యార్థి డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. అతడికి పరీక్షలు జరుగుతున్నాయి. హాల్ టికెట్ కోసం వెళ్లిన అతడికి దానిని తీసుకోగానే కళ్లు బైర్లు కమ్మాయి.

  మీనాపూర్ బ్లాక్ కు చెందిన కుందన్ కుమార్... స్థానికంగా ఉండే మహతో డిగ్రీ కాలేజీలో రెండో ఏడాది చదువుతున్నాడు. అతడికి ఇచ్చిన హాల్ టికెట్ లో.. తన తండ్రి పేరుగా ఇమ్రాన్ హష్మి, తల్లిగా సన్ని లియోని పేరు నమోదైంది. అది చూసిన ఆ విద్యార్థి షాక్ కు గురయ్యాడు. ఇంటికి వెళ్లి తన తండ్రికి ఈ విషయం చెప్పాడు. అది చూసిన తండ్రి ఖంగుతిని... ‘లేదు నాన్నా.. నూవ్ నా కొడుకువే.. మీ అమ్మ అలాంటిది కాదు.. ’అని స్పష్టం చేశాడు.

  ఈ విషయాన్ని కాలేజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు ఎప్పటిలాగానే సినిమా డైలాగులే చెప్పారు. దీనిపై విచారణ వేయించి.. నిందితులను పట్టుకుంటామని అన్నారు. సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి ఎలాంటి హాల్ టికెట్ అవసరం లేదని.. ఆధార్ కార్డు తీసుకొచ్చిన చాలని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనపై ఇమ్రాన్ హష్మి కూడా స్పందించడం గమనార్హం. ‘నన్ను నమ్మండి.. అది నేను కాదు..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక మచ్చు తునక అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: