హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral: అక్రమ మద్యం కేసులో రామచిలుకను బంధించిన పోలీసులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Video Viral: అక్రమ మద్యం కేసులో రామచిలుకను బంధించిన పోలీసులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Bihar police(Photo:Youtube)

Bihar police(Photo:Youtube)

Video Viral: పోలీసులు నేరస్తుడ్ని పట్టుకోమంటే అతని పెంపుడు పక్షిని అరెస్ట్ చేశారు. బోనులో బంధించి పోలీస్‌ స్టేషన్‌కు తెచ్చి పారిపోయిన నిందితుడి ఆచూకి చెప్పమని చిలుకను వేధిస్తు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

ఇప్పటి వరకు వేర్వేరు కేసుల్లో మైనర్‌లను, పెంపుడు జంతువుల్ని పోలీసులు (Police)అరెస్ట్ చేసినట్లుగా విన్నాం. కాని మొట్ట మొదటిసారి బీహార్ (Bihar )పోలీసులు రామచిలుకను అరెస్ట్ చేశారు. చిలుకను అరెస్ట్ చేయడం ఏమిటని ఆశ్చర్యపోకండి .. ఇది నిజం. అయితే ఇందులో రామ చిలుక (Parrot)చేసిన తప్పు, నేరం ఏమి లేదు. దాని యజమాని నేరం చేసి పారిపోతే అతని ఆచూకి ఏమైనా చిలుక చెబుతుందనే విషయంపై దాన్ని అదుపులోకి తీసుకున్నారు. రామచిలుకను అరెస్ట్ చేసి బంధించిన వీడియో(Video) ఇప్పుడు వైరల్(Viral) అవుతోంది.

Republic Day Special : 1947లో పాక్ నుంచి భారత్‌కి ట్రైన్ టికెట్.. ధర ఎంతో తెలుసా?

అక్రమ మద్యం కేసులో పోలీసుల ఓవరాక్షన్..

పోలీసులు నేరస్తుల్ని పట్టుకోవడానికి తమ తెలివి తేటలు ఉపయోగించకుండా చిలుక జోస్యంపై ఆధారపడిన వార్త బీహార్‌లో వైరల్‌గా మారింది. గయాలోని గురువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్స్‌పెక్టర్ కన్హయ్యకుమార్ తన పోలీసు బృందాన్ని తీసుకొని నేరస్తుడ్ని పట్టుకోవడానికి అతని ఇంటిపై రైడ్ చేశారు. అయితే పోలీసులు వచ్చిన విషయాన్ని చిలుక గమనించి తన పలుకులతో యజమానికి సంకేతం ఇవ్వడంతో మద్యం అమ్మతున్న వ్యక్తి అమృత్ మల్లా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి నుంచి పారిపోయారు.

పోలీస్ స్టేషన్‌ బంధీగా చిలుక..

పోలీసులు సీక్రెట్‌గా వెళ్లినా నేరస్తులు ఎలా తప్పించుకున్నారనే దానిపై అనుమానిస్తుండగా ఇంటి వరండాలో ఉన్న రామచిలుక పోలీసుల్ని చూసి అరవడం కనిపించింది. అంతే ఇదే వాళ్లకు సంకేతాలు ఇచ్చి తప్పించుకునేలా చేసిందని భావించారు. వెంటనే రామచిలుకను బోనులో బంధించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. యజమాని ఆచూకి ఏమైనా తన చిలక పలుకులతో చెబుతుందని స్టేషన్‌కు తెచ్చినప్పటికి అది మాత్రం నోరు మెదపడం లేదు.

పోలీసుల తీరుపై విమర్శలు..

ఒక నేరస్తుడైన యజమానిని కాపాడేందుకు రామచిలుక చూపిస్తున్న స్వామిభక్తిని చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. లేదంటే రామచిలుక తన యజమాని గొంతు వింటే గుర్తు పట్టే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు. అందుకే రూపు బౌల్స్ తప్ప మరేం మాట్లాడలేదు. గురువా పోలీసు చిలుక నుండి మద్యం వ్యాపారి అమృత్ మల్లా ఎక్కడికి వెళ్లాడు? పదే పదే అడుగుతున్నా చిలుక నుంచి సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

Republic Day Photos : త్రివర్ణమయమైన భారతావని.. ఫొటోలు చూడండి

వీడియో వైరల్ ..

అయితే పోలీసులు ఓ అక్రమ మద్యం తయారి వ్యాపారిని అరెస్ట్ చేసే విషయంలో మూగజీవిని బంధించడం స్థానికులు చూసి సీక్రెట్‌గా వీడియో తీశారు. రామచిలుకను ఇంటరాగేషన్ చేస్తున్న వాయిస్‌ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

First published:

Tags: Bihar News, Viral Video

ఉత్తమ కథలు