హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘కండోమ్ కూడా ఫ్రీగానే కావాలా..?.. ’.. బాలిక పై మండిపడిన మహిళా కలెక్టర్..

‘కండోమ్ కూడా ఫ్రీగానే కావాలా..?.. ’.. బాలిక పై మండిపడిన మహిళా కలెక్టర్..

మహిళ కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా

మహిళ కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా

 • News18 Telugu
 • Last Updated :
 • Bihar, India

  కొంత మంది ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి పూర్తిగా అవగాహన ఉండదు. దీంతో అధికారులు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటాయి. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరాలని అధికారులు భావిస్తుంటారు. దీనిలో భాగంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడటాయి. ఇదిలా ఉండగా బీహార్ లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో లేడీ కలెక్టర్ పాల్గొన్నారు. దీనిలో ఆమె విద్యార్థినులతో అనేక విషయాలలో ముఖా ముఖిగా మాట్లాడారు. ఈ క్రమంలో కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి.

  పూర్తి వివరాలు.. బీహార్ లోని పాట్నాలో అమ్మాయిల పట్ల వివక్షతను రూపుమాపడం అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో స్థానిక మహిళ కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా (IAS officer Harjot Kaur Bhamra) పాల్గొన్నారు. దీనిలో ఆమె కొందరు విద్యార్థులతో పాఠశాలలోని సమస్యలు ఏవైన ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఒక యువతి.. తమ పాఠశాలలో మరుగు దొడ్డి సమస్యగాఉందని, డోర్ లు సరిగ్గా లేవని చెప్పింది. తమ పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తో చెప్పింది. దీనిపై కలెక్టర్ మీ ఇంట్లో ఎన్ని మరుగు దొడ్డులు ఉన్నాయనిబాలికను ప్రశ్నించారు. అంతే కాకుండా.. ప్రభుత్వం విద్యార్థినులకు 20,30 శానిటరీ ప్యాడ్ లను ఇవ్వగలదా అని ప్రశ్నించింది.

  దీనిపై కలెక్టర్ కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రేపు మీకు జీన్స్ ప్యాంట్ ఇస్తుంది.. ఆ తర్వాత బూట్లు, ఇలా ప్రతి ఒక్కటి ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందని కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా చురకలంటించారు. అంతే కాకుండా చివరకు కుటుంబ నియంత్రణ కోసం కండోమ్ కూడా ప్రభుత్వమే ఇస్తుందని కూడా విద్యార్థినితో అన్నారు. దీనికి విద్యార్థిని.. ప్రజలు ఓట్లు వేయడం వలన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పింది. దీనికి కలెక్టర్ మరీ.. పాకిస్థాన్ మాదిరిగా ఓట్లు వేయకండని వ్యాఖ్యలు చేసింది.

  'సశక్త్ బేటీ, సమృద్ధ్ బీహార్' (సాధికారత పొందిన కుమార్తెలు, సంపన్న బీహార్)పై వర్క్‌షాప్‌లో ఒక మురికివాడకు చెందిన ఒక టీనేజ్ విద్యార్థితో కలెక్టర్ మాట్లాడింది. దీనిలో అధికారి ప్రధాన ఉద్దేశ్యం మన ఆలోచనలో మార్పులు రావాలని, ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడకూడదని మనం కష్టపడి మంచి ఉద్యోగం సాధించాలని ఆమె పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహిళ కలెక్టర్ చేసిన కండోమ్ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు కలెక్టర్ ను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఒక ఉన్నత స్థానంలో ఉండి యువతులతో ఇలా మాట్లాడటం ఏంటని కామెంట్లు పెడుతున్నారు.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Bihar, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు