Bihar Groom two others injured during celebratory firing: ప్రస్తుతం కొన్ని చోట్ల పెళ్లిళ్లలో వింత ఆచారాలు, వెరైటీ సంప్రదాయాలను పాటిస్తుంటారు. కొంత మంది పెళ్లి వేడుకలో తుపాకీలు, కత్తులను కూడా తమతో పాటు తీసుకెళ్తారు. తుపాకీలను పెళ్లి జరిగేటప్పుడు గాల్లోకి కాల్పులు జరుపుతారు. కొందరు లైసెన్స్ డ్ వేపన్స్ ను కల్గి ఉంటారు. కానీ కొందరు గన్ లను అక్రమంగా ఉపయోగిస్తుంటారు. ఒక్కొసారి గన్ లు పెళ్లిళ్లలో ఉపయోగించేటప్పుడు అనుకోని ఘటనలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన ప్రస్తుతం బీహార్ లో జరిగింది.
బీహార్ లోని భోజ్ పూర్ పెళ్లి కి ముందు జరిగే వేడుకలో అనుకొని సంఘటన జరిగింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. భోజ్ పూర్ లో పెళ్లికి ముందు ఒక కార్య క్రమంలో జరిగింది. ఈవేడుకకు వరుడి స్నేహితులు హజరయ్యారు. పాట్నాలోని భలుహిపుర్ లో జరిగిన పెళ్లి వేడుకలలో ఇది జరిగింది. వరుడి కుటుంబం రాత్రి సంగీత్ కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు వరుడి స్నేహితులు తమ వద్ద ఉన్న గన్ ను బయటకు తీశారు. ఆ తర్వాత... అక్కడ డీజేకు తగ్గట్టుగా డ్యాన్స్ చేశారు.
ఈ క్రమంలో గాల్లో కాల్పులు జరిపారు. అప్పుడు.. షాకింగ్ ఘటన జరిగింది. గన్ ను అదుపుతప్పి..కిందపడ్డారు. ఇంతలో గన్ బుల్లెట్లు.. వరుడికి, అతని స్నేహితులకు గాయాలయ్యాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కరణ్ కుమార్, వరుడి మేనమామ రామ్ విలాష్ చౌదరి ఉన్నారు. వెంటనే వారని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, స్థానికుల సమాచారంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ పెళ్లి మే2 తేదిన జరగనుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.