హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG:  చాయ్ వాలీగా మారి ట్రెండ్ సృష్టిస్తున్న యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..

OMG:  చాయ్ వాలీగా మారి ట్రెండ్ సృష్టిస్తున్న యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..

డిగ్రీ పూర్తిచేసిన ప్రియాంక

డిగ్రీ పూర్తిచేసిన ప్రియాంక

Bihar: మనలో చాలా మంది డబ్బుల కోసం తల్లిదండ్రులపైనే ఆధారపడతారు. కొందరు చదువు పూర్తికాగానే, ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతారు. మరికొందరు మాత్రం తాము కోరుకున్న ఉద్యోగం కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. దీని కోసం ఎన్ని సవాళ్లనైన ఎదుర్కొంటారు.

ఇంకా చదవండి ...

Bihar Graduate Sells Tea Inspirational story: నేటి యువత తమకంటు ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. చదువు, తాము చేసే కోర్సు, దానిలో మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటున్నారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలవైపు మొగ్గుచూపితే, మరికొందరు ప్రభుత్వ కొలువులంటే ఆసక్తి చూపుతుంటారు. ఇక కొందరు బిజినెస్ చేయడానికి సైతం వెనుకాడరు. ప్రస్తుతం యువత.. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలాంటి మార్గలాలో ఆలస్యమైన తాము ఎన్నుకున్న రంగంలోని రాణించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఒక యువతి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బీహర్ లోని పూర్నియాకు చెందిన ప్రియాంక అనే యువతి మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్, వారణాసి నుంచి ఎకానిమిక్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆమెకు ప్రభుత్వ కొలువు సాధించడమంటే ఇష్టం. అందుకు తన ఆసక్తిని ఇంట్లో వారితో చెప్పింది. దానికి వారు కూడా అంగీకరించారు. ఆమె రెండెళ్లపాటు.. పాట్నాలో ఉంటూ ప్రత్యేకంగా పరీకల కోసం ప్రిపేర్ అయ్యింది. కానీ ఆమెకు ఉద్యోగం రాలేదు. వారి ఆర్థిక పరిస్థితులు కూడా సహాకరించలేదు. దీంతో ఆమె తన వాళ్లకు భారం కాకూడదని ఆలోచించింది. నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుందో... ఏంటో కానీ.. వెంటనే పాట్నాలోని స్థానిక ఉమెన్స్ కాలేజ్ ముందు ఒక టీ కొట్టు పెట్టింది.


అక్కడ ప్రతి రోజుల కాలేజ్ యువతులను ప్రత్యేకంగా రకరకాల టీలు అమ్మటం మొదలు పెట్టింది. దీంతో ఆమె కొంత వరకు తన భారం ఇంట్లో వారికి కల్గకుండా చూసుకుంది. ఆమె.. పాన్ టీ, చాక్లెట్ టీ, అని ప్రత్యేక మైన , రుచికరమైన టీలను తయారు చేస్తుంది. కొందరు యువకులు తాము.. చేసే పనిని చుట్టు పక్కల వారు ఏమనుకుంటారో అని నామోషిగా ఫీలవుతారు. కానీ ఈ యువతి.. తన పనిపట్ల నిబద్దతను ప్రదర్శించింది.

దీనిపై ప్రియాంక మాట్లాడుతూ... నేను 2019లో UG పూర్తి చేశాను. కానీ గత 2 సంవత్సరాలలో ఉద్యోగం పొందలేక పోయాను. నేను ప్రఫుల్ బిల్లోర్ నుండి స్ఫూర్తి పొందాను. చాలా మంది చాయ్‌వాలాలు ఉన్నారు, చాయ్‌వాలీ ఎందుకు ఉండకూడదు?, అని ఆమె చెప్పింది. అదే విధంగా.. తీరిక సమయాల్లో చదువుకుంటున్నట్లు తెలిపింది. అందరు ఏమనుకుంటారో ఆలోచించవద్దు.. ఆత్మనిర్బార్ భారత్ వైపు అడుగులు వేయండని ఆమె పలువురిని ఉత్సాహపరుస్తుంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు దేశంలో ఉద్యోగాలు లేకపోవడంపై విచారకరం అంటూ తమ ఒపినియన్ వ్యక్తం చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: New business, Tea, Uttar pradesh

ఉత్తమ కథలు