Home /News /trending /

BIHAR ELDERLY FARMER RAM BAHADUR SHAH RECEIVES RS 52 CRORE IN HIS PENSION ACCOUNT SU

Rs 52 Crore In Bank Account: పింఛన్ అకౌంట్‌లో రూ. 52 కోట్లు.. షాక్ తిన్న వృద్దుడు.. అతడు ఏమన్నాడంటే..

రామ్‌ బహుదూర్‌ షా(Ram Bahadur Shah)

రామ్‌ బహుదూర్‌ షా(Ram Bahadur Shah)

ఇటీవల ఇద్దరు విద్యార్థులు బ్యాంకు అకౌంట్స్‌లో రూ. 960 కోట్లు జమ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ రైతు పింఛన్ ఖాతాలో రూ. 52 కోట్లు జమ కావడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.

    బిహార్‌లో(Bihar) సాధారణ జనాల బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఇద్దరు విద్యార్థులు బ్యాంకు అకౌంట్స్‌లో రూ. 960 కోట్లు జమ అయిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల ఖాతాల్లో అంత మొత్తం ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి విచారణ సాగుతుండగానే.. అదే రాష్ట్రంలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఓ రైతు బ్యాంక్ ఖాతాలో రూ. 52 కోట్లు జమ అయ్యాయి (Farmer Receives 52 Crore in his Account). పింఛన్‌కు సంబంధించి కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లగా.. అతని ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడినట్టుగా గుర్తించాడు. వివరాలు.. బిహార్‌లోని ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా(Ram Bahadur Shah) కొంత కాలం కిందట వృద్దాప్య పింఛను కోసం బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. అయితే రామ్ బహుదుర్.. తన పింఛన్ డబ్బులకు సంబంధించి అకౌంట్‌ను చెక్ చేసుకోవడానికి సమీపంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు (Customer Service Point) వెళ్లాడు. అక్కడ ఆధార్ కార్డు సమర్పించిన అతడు, వేలిముద్ర వెరిఫికేషన్‌ చేశాడు. అయితే అతని అకౌంట్‌లో రూ. 52 కోట్లు గుర్తించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆపరేటర్ షాక్ తిన్నాడు. ఇదే విషయాన్ని రామ్ బహుదుర్‌కు తెలియజేశాడు.

    క్షణాల్లోనే ఈ విషయం ఆ చుట్టుపక్కల వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రాహ్ బహుదుర్ వద్దకు చేరుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి రామ్ బహుదుర్ మాట్లాడుతూ.. ‘ఈ విషయం తెలిసి మేము షాక్ తిన్నాం. ఇంత పెద్ద మొత్తం నా బ్యాంకు అకౌంట్‌లోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యమేసింది. మేము వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నా ఖాతాలో పడిన కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది’అని చెప్పారు.

    Viral News: ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలో రూ.960 కోట్లు జమ.. షాక్ అయిన స్థానికులు.. ఏం జరిగిందంటే..

    ఇందుకు సంబంధించి స్థానికులు, మీడియా ద్వారా సమాచారం అందిందని కతిహర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ మనోజ్ పాండే (Manoj Pandey) చెప్పారు. ప్రస్తుతం ఈ విషయాన్ని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. తాము కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. రామ్ బహుదుర్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న బ్యాంక్ అధికారిని కూడా ప్రశ్నించనున్నట్టుగా చెప్పారు.

    షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అమ్మాయి.. అనుమతించని సిబ్బంది.. చివరకు అలా..

    ఇక, బిహార్‌లో కతిరాహ్ జిల్లా(Kathiraah District) జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలోకి రూ. 960 కోట్లు డిపాజిట్ అయింది. విశ్వాస్ ఖాతాలో రూ.60 కోట్లు, అసిత్ కుమార్ అకౌంట్‌లో రూ.900 కోట్లు జమ అయింది. ఈ ఘటనతో బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయారు. అమౌంట్ విత్ డ్రా చేసుకోకుండా వారిని నిలువరించారు. అనంతరం సంబంధిత సమాచారాన్ని పై అధికారులకు నివేదించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా డిపాజిట్ అయిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక, బిహార్‌లో సాధారణ ప్రజల ఖాతాల్లోకి కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Bank account, Bihar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు