BIGG BOSS 3: బిగ్‌ బాస్‌లో నాగార్జున చేతిలోని కోతి బొమ్మ అసలు కథ తెలుసా?

Bigg Boss Telugu Season 3 | రెండేళ్ల క్రితం మొదటిసారి మార్కెట్లోకి వచ్చిన కోతి బొమ్మ టాయ్స్ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. ఇప్పుడు అదే కోతి బొమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో హోస్ట్ నాగార్జున చేతిలో ప్రత్యక్షమైంది.

news18-telugu
Updated: July 26, 2019, 6:15 PM IST
BIGG BOSS 3: బిగ్‌ బాస్‌లో నాగార్జున చేతిలోని కోతి బొమ్మ అసలు కథ తెలుసా?
BIGG BOSS 3: బిగ్‌ బాస్‌లో నాగార్జున చేతిలోని కోతి బొమ్మ అసలు కథ తెలుసా?
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చూశారా? ప్రోమోల దగ్గర్నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం వరకు హోస్ట్ నాగార్జున చేతిలో ఉన్న చిన్న కోతి బొమ్మను గమనించారా? అసలు ఆ కోతి బొమ్మ కథ ఏంటీ? అది నాగార్జున చేతిలో ఎందుకు ఉందన్న చర్చ బిగ్ బాస్ వీక్షకుల్లో ఉంది. 'పండు' అంటూ నాగార్జున ముద్దుగా పిలిచే ఆ కోతి బొమ్మ టాయ్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రొడక్ట్. చేతి వేలిని పట్టుకొని ఉండే కోతి బొమ్మ మామూలు బొమ్మ కాదు. అది రోబోటిక్ మంకీ. WowWee అనే కంపెనీ తయారు చేసిన ఫింగర్‌లింగ్స్ టాయ్‌లైన్‌లో రోబోటిక్ మంకీతో పాటు డ్రాగన్, పాండా లాంటి ఇతర టాయ్స్ కూడా ఉన్నాయి. రెండేళ్ల క్రితం మొదటిసారి మార్కెట్లోకి వచ్చిన కోతి బొమ్మ టాయ్స్ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. ఇప్పుడు అదే కోతి బొమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో హోస్ట్ నాగార్జున చేతిలో ప్రత్యక్షమైంది.


ఫింగర్‌లింగ్స్ టాయ్స్ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోటిక్ టాయ్స్ రకరకాల శబ్దాలు చేస్తుంది. మెడ తిప్పడం, కనురెప్పలు కొట్టడం లాంటి 40 రకాల యానిమేషన్స్‌తో వేర్వేరు సౌండ్స్ చేయడం ఫింగర్‌లింగ్స్ టాయ్స్ ప్రత్యేకత. చేతి స్పర్శను బొమ్మలో ఉండే సెన్సార్స్ గుర్తించి అందుకు తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది. ఒరిజినల్ ఫింగర్‌లింగ్స్ 6 కలర్స్‌లో లభిస్తుంది. సోఫీ, బెల్లా, బోరిస్, జో, ఫిన్, మియా రంగుల్లో ఆకట్టుకుంటాయి ఈ బొమ్మలు. పిల్లలైనా, పెద్దవాళ్లైనా ఫింగర్‌లింగ్స్ చేతిలో ఉన్నంతసేపూ దాంతో ఆడుకుంటూ ఉండాల్సిందే. ఈ టాయ్స్‌కి డిమాండ్ పెరగడంతో చాలా కంపెనీలు ఇలాంటి బొమ్మల్ని తయారు చేస్తున్నాయి. ఈ ఇంటరాక్టీవ్ టాయ్స్ ఇండియాలో కూడా లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ సైట్లల్లోనూ కొనొచ్చు.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... ప్రారంభమైన రిజిస్ట్రేషన్

Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ...
First published: July 26, 2019, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading