‘బిగ్ బాస్ 2’ విజేత కౌశల్ సక్సస్ సీక్రెట్ అదేనట..నెటిజన్స్ సెటైర్స్

Bigg Boss Telugu 3 | బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌లకు సలహా ఇచ్చేలా సీజన్ 2 విజేత కౌశల్ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా...దీనిపై నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు.

news18-telugu
Updated: July 9, 2019, 11:24 AM IST
‘బిగ్ బాస్ 2’ విజేత కౌశల్ సక్సస్ సీక్రెట్ అదేనట..నెటిజన్స్ సెటైర్స్
కౌశల్
  • Share this:
త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ మూడో సీజన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంటోంది. బిగ్ బాస్ 3 హోస్ట్‌గా అక్కినేని నాగార్జున పేరు అధికారికంగా ఖరారు కావడం తెలిసిందే. కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్ సందేశ్, రవికృష్ణ, తీన్మార్ సావిత్రి తదితరులను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21 నుంచి ‘స్టార్ మా’లో ‘బిగ్ బాస్ 3’ ప్రసారాలు ప్రారంభంకావచ్చని సమాచారం.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ తన సక్సస్ సీక్రెట్ ఇదే అన్నట్లు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో మన వెనుక నుంచి మాట్లాడే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కౌశల్ పేర్కొన్నాడు. బిగ్ బాస్2 హౌస్‌లో సహ కంటెస్టెంట్ నూతన్ నాయుడుతో కౌశల్ ముచ్చటిస్తున్న వీడియో అది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కోసం అన్నట్లు కౌశల్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

I Just believe in MYSELF,That's the first secret of my success..I don't care others what they talk behind me...Just follow this for your success too👍


kaushal manda (@kaushalmanda) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


కౌశల్ పోస్ట్ పట్ల కొందరు నెటిజన్స్ సటైర్స్ వేస్తున్నారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉండిపోవడం కాకుండా..జీవితంలో మరింత విజయాలు సాధించడంపై కౌశల్ దృష్టిసారిస్తే మంచిదని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు.
First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు