‘బిగ్‌బాస్ 2’ విన్నర్ కౌశల్ క్రేజ్ పీక్స్... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు!

ఓ టీవీ షోలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా కౌశల్ సరికొత్త చరిత్ర... కౌశల్ ఆర్మీ కోరితే రాజకీయాల్లోకి రావడానికైనా, హీరోగా చేయడానికైనా సిద్ధమైనని ప్రకటించిన ‘బిగ్‌బాస్’ టైటిల్ విన్నర్!

Chinthakindhi.Ramu
Updated: October 4, 2018, 7:26 PM IST
‘బిగ్‌బాస్ 2’ విన్నర్ కౌశల్ క్రేజ్ పీక్స్... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు!
కౌశల్‌ను చూసేందుకు వచ్చిన జనం
  • Share this:
‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్‌కు బయటికి వచ్చాక కూడా క్రేజ్ తగ్గడం లేదు. లేటెస్ట్‌గా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చిన కౌశల్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. కౌశల్ షోరూం దగ్గరికి రాగానే... ‘కౌశల్...కౌశల్’ అంటూ ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. కౌశల్‌ను ఫోటోలు తీసుకునేందుకు, ఆయన్ని దగ్గర్నుంచి చూసేందుకు జనం ఎగబడ్డారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ, కారు పైకి ఎక్కాడు కౌశల్. ఓ టీవీ షో కార్యక్రమంలో పార్టిసిపెంట్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్ రావడం మాత్రం ‘నభూతో నభవిష్యత్’ అనే చెప్పాలి. కౌశల్ క్రేజ్ కారణంగా... సెన్సేషనల్ హిట్టు కొట్టిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ హీరోహీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లకు ఎవ్వరూ పట్టించుకోకపోవడం విశేషం.

‘బిగ్‌బాస్’ టైటిల్ గెలిచినందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్వయంగా అభినందిస్తూ ట్వీట్ చేయడం విశేషం. మహేష్ ‘రాజకుమారుడు’ సినిమాలో చిన్న పాత్ర వేసిన కౌశల్, ఇప్పుడు ‘బిగ్‌బాస్’ టైటిల్ గెలవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు మహేష్. దీంతో కౌశల్ అభిమానులు, కౌశల్- మహేష్ కంబైన్డ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు, కొన్ని సిరీయల్స్‌లో విలన్ వేషాలు వేసిన కౌశల్‌...ఒక్క షోతో బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అధికారికంగా లెక్కలు ప్రకటించకపోయినా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కౌశల్‌కి ఏకంగా 39 కోట్ల 50 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని టాక్. ఈ స్థాయిలో ఓ పార్టిసిపెంట్‌కి ఓట్లు రావడం ‘బిగ్‌బాస్’ చరిత్రలోనే కాదు, ఓ టీవీ కార్యక్రమంలోనే ఓ సంచలనం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమం చూసేవారిలో మెజారిటీ శాతం మంది కౌశల్‌కే ఓట్లు వేయడం... తమ అభిమాన పార్టిసిపెంట్ గెలవాలనే తపనతో మరిచిపోకుండా రోజూ ఓట్లు వేశారు. ఈ స్థాయిలో ప్రజాదరణ సొంతం చేసుకున్న కౌశల్... ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ స్థానం సంపాదించుకున్నారు.

ఓ టీవీ షోలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా కౌశల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. త్వరలో ఈ రికార్డు గిన్నిస్ బుక్‌లో ఎక్కబోతోంది. ఈ విషయాన్ని కౌశల్ స్వయంగా అభిమానులతో పంచుకోవడం విశేషం. అంతేకాకుండా బోయపాటి, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కౌశల్ ఓ పాత్ర చేయబోతున్నాడని టాక్. ఈ సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, ఖరారు కాగానే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పాడు కౌశల్. అంతేకాకుండా కౌశల్ ఆర్మీ కోరితే... తాను రాజకీయాల్లోకి రావడానికైనా, హీరోగా సినిమాలు చేయడానికైనా సిద్ధమైనని ప్రకటించాడు కౌశల్. కౌశల్ క్రేజ్ ఎంతవరకూ వెళుతుందో చూడాలి.‘కౌశల్ ఆర్మీ’ క్రేజ్ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
First published: October 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>