బిగ్‌బాస్: కౌశల్‌కి ఇంత క్రేజ్ రావడానికి కారణాలేంటి?

ఒక్క టీవీషోలో పార్టిసిపెంట్‌కి ఈ స్థాయిలో ప్రజాదరణ దక్కడం మాత్రం తెలుగులో తొలిసారి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 1, 2018, 12:34 PM IST
బిగ్‌బాస్: కౌశల్‌కి ఇంత క్రేజ్ రావడానికి కారణాలేంటి?
బిగ్‌బాస్ ట్రోపీతో కౌశల్
  • Share this:
కౌశల్... అందరూ ఊహించినట్టుగానే ‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ గెలిచాడు. ఎప్పుడూ లేనంతగానే, ఎవ్వరూ ఊహించనంతగా భారీ తేడాతో ఏకపక్ష విజయం సాధించాడు. సాధారణంగా టీమిండియా పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిస్తేనో, వరల్డ్‌కప్ గెలిస్తేనో...సంతోషంతో సంబరాలు జరుపుకునే సామాన్య ప్రజానీకం... కౌశల్ గెలిస్తే...ఒక్క టీవీ షోలో పార్టిసిపెంట్ గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారు. కౌశల్ విజయాన్ని కేక్‌లు కట్ చేసుకుని, బాంబులు పేలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఒక్క టీవీషోలో పార్టిసిపెంట్‌కి ఈ స్థాయిలో ప్రజాదరణ దక్కడం తెలుగులో ఇదే మొట్టమొదటిసారి.

అసలు కౌశల్ గెలవడానికి కారణాలేంటి... కౌశల్‌కి ప్రేక్షకులు ఎందుకు ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. 113 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ కార్యక్రమంలో మిగిలిన వారు చేయలేని పని, కేవలం కౌశల్‌కి మాత్రమే సాధ్యమయ్యిందంటే అందుకు దారితీసిన పరిస్థితులేంటి...

* కిరిటీ చేసిన ఆ పని...
‘బిగ్‌బాస్’ ప్రారంభమైన మొదటి మూడు వారాల్లో కౌశల్‌పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కౌశల్ టైటిల్ విన్నర్ అవుతాడని కూడా ఎవ్వరూ అనుకోలేదు. అయితే మూడో వారంలో కౌశల్‌ను కార్నర్ చేస్తూ కిరిటీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కెప్టెన్సీ టాస్క్ సమయంలో కూడా కౌశల్‌ను ఓడించేందుకు మిగిలిన హౌస్ పార్టిసిపెంట్స్ చేసిన పనులు, ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ...’ కిరిటీ చేసిన వ్యాఖ్యలు కౌశల్ మీద ప్రేక్షకుల్లో సానుభూతి పెరగడానికి కారణమయ్యాయి. ఆ సందర్భమే ‘కౌశల్ ఆర్మీ’ పుట్టడానికి కారణమైంది. అప్పటిదాకా ‘నెక్ట్స్ ఎలిమేనేట్ అయ్యేది కౌశల్‌’ అని ఫిక్స్ అయిన వారు కూడా కౌశల్‌కి ఓటు వేయడం మొదలెట్టారు.
bigg boss 2, బిగ్‌బాస్ 2, బాబు గోగినేని, నాని, geetha madhuri, koushal, babu gogineni, nandini, హిందీ బిగ్‌బాస్ 12, kaushal army, kaushal army 2k walk, కౌశల్ ఆర్మీ, big boss telugu vote, bigg boss vote, telugu bigg boss vote, bigg boss 2 telugu vote, bigg boss telugu voting vote, bigg boss telugu, big boss 2 telugu vot,e bigg boss telugu vote 2018, bigg boss winner kaushal, Kaushal army, కౌశల్ ఆర్మీ, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ విన్నర్
* అంతా కపట నాటకం
కౌశల్‌ను కార్నర్ చేస్తూ కిరిటీ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నాని వివరణ అడిగినప్పుడు ‘ఇక్కడ జరుగుతున్నదంతా కపట నాటకం...’ అంటూ కౌశల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ జనాలకెంతో నచ్చింది. లోపల జరుగుతున్న విషయాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పిన కౌశల్‌కి అభిమానులు పెరిగారు. ఇప్పటి నుంచి హౌస్‌లో ఎవరు ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనే విషయాన్ని కౌశల్ ఆర్మీ డిసైడ్ చేయడం మొదలైంది.* కోడి గుడ్లు... గేమ్ ఆడడానికే వచ్చా!
ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఎక్కువ మంది కౌశల్‌ని టార్గెట్ చేస్తూ ‘బంధాలు పెట్టుకోవడం లేదు... మాతో కలవడం లేదంటూ...’ గుడ్లు కొట్టాడు. అప్పుడు కూడా ‘అవును నేను గేమ్ ఆడడానికి వచ్చా... ఎటువంటి బంధాలు పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు...’ అని క్లియర్‌గా చెప్పాడు. అప్పటి నుంచి బిగ్‌బాస్ చూసే మెజారిటీ మంది కౌశల్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. మిగిలిన వారు హౌస్‌లో ఫ్రెండ్‌షిప్ పేరుతో చేస్తున్న పనులను చూసి విసిగిపోయిన వారికి కౌశల్ ఆటతీరు ఎంతగానో ఆకట్టుకుంది.
bigg boss 2, బిగ్‌బాస్ 2, బాబు గోగినేని, నాని, geetha madhuri, koushal, babu gogineni, nandini, హిందీ బిగ్‌బాస్ 12, kaushal army, kaushal army 2k walk, కౌశల్ ఆర్మీ, big boss telugu vote, bigg boss vote, telugu bigg boss vote, bigg boss 2 telugu vote, bigg boss telugu voting vote, bigg boss telugu, big boss 2 telugu vot,e bigg boss telugu vote 2018, bigg boss winner kaushal, Kaushal army, కౌశల్ ఆర్మీ, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ విన్నర్
* యాపిల్ టాస్క్... భానుశ్రీ వ్యాఖ్యలు
యాపిల్ టాస్క్‌లో భాగంగా తన డ్రెస్ లోపల దాచుకున్న యాపిల్ తీయడానికి ప్రయత్నించాడనే ఉద్దేశ్యంతో భానుశ్రీ, కౌశల్‌పై విరుచుకుపడింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నానా రచ్చ చేసింది. ఆమెను తేజస్వి కూడా సపోర్ట్ చేసింది. అయితే వాళ్ల టీమ్‌లోనే ఉన్న గీతామాధురి, కౌశల్ తప్పు చేయలేదని చెప్పడంతో తేజస్వి, భానుశ్రీ కావాలనే ఎక్కువ చేస్తున్నారనే విషయం బాగా అర్థమైంది.
* బంధాల గురించి మీరే మాట్లాడాలి...
తనీశ్‌తో రొమాన్స్ నడిపిస్తూ, హౌస్‌లో నానా రచ్చ చేసిన దీప్తి సునయన... కాయిన్స్ టాస్క్ అప్పుడు కౌశల్‌పై టార్గెట్ చేసింది. ఆ సమయంలో ‘బంధాల గురించి మీరే మాట్లాడాలి...’ అంటూ సెటైర్ వేసింది. అయినా తన దగ్గరున్న కాయిన్స్‌లో కొన్ని తీసి మహిళల టీమ్‌ చేసిన టఫ్ ఫైట్‌ని అభినందిస్తూ వాళ్లకి ఇచ్చాడు కౌశల్. ఆ పనికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
* కాల్ సెంటర్ టాస్క్...
కాల్ సెంటర్ టాస్క్ సమయంలో దీప్తి సునయన... పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, తిడుతూ విసిగిస్తున్నా చాలా ఓపికగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు కౌశల్. సడెన్‌గా షణ్ముక్ పేరు తీసుకొచ్చి, దీప్తి సునయనను ఎమోషనల్‌గా ఇరికించేశాడు. ఆ తర్వాత గణేశ్ ఎంత రెచ్చిపోతున్నా, నవ్వుతూ మాట్లాడడం జనాల హృదయాలను కొల్లగొట్టేసింది. దీప్తి సునయన ఎలిమినేట్ అవుతున్నప్పుడు కూడా ‘బయట ఇంటర్వ్యూలలో ఏమైనా కృశ్చన్స్ వేస్తే... తెలియక చేశానని చెప్పు’ అని చెప్పి, తనను ద్వేషించిన అమ్మాయికి కూడా సలహా ఇచ్చాడు. తనను శత్రువుగా భావించిన వ్యక్తిని కూడా మంచి సలహాలు ఇచ్చిన గుణం ఆకట్టుకుంది.
* గీతా మాధురి- బాబు గోగినేని గొడవ
కెప్టెన్సీ టాస్క్ సమయంలో దీప్తి నల్లమోతు మీద బకెట్‌తో నీళ్లు పోసి, దించేశాడు బాబు గోగినేని. దాంతో మిగిలిన వారిని తోస్తూ దించేసి... గీతామాధురిని కెప్టెన్ చేశాడు కౌశల్. ఆ సమయంలో బాబు గోగినేని, గీతామాధురి మధ్య గొడవ జరిగితే... మిగిలిన పార్టిసిపెంట్లు సైలెంట్‌గా ఉన్న సమయంలో గీతకి సపోర్ట్‌గా మాట్లాడి మార్కులు కొట్టేశాడు కౌశల్.
bigg boss 2, బిగ్‌బాస్ 2, బాబు గోగినేని, నాని, geetha madhuri, koushal, babu gogineni, nandini, హిందీ బిగ్‌బాస్ 12, kaushal army, kaushal army 2k walk, కౌశల్ ఆర్మీ, big boss telugu vote, bigg boss vote, telugu bigg boss vote, bigg boss 2 telugu vote, bigg boss telugu voting vote, bigg boss telugu, big boss 2 telugu vot,e bigg boss telugu vote 2018, bigg boss winner kaushal, Kaushal army, కౌశల్ ఆర్మీ, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ విన్నర్
* కౌశల్ ఆర్మీ ఫోన్ కాల్...
వారం వారం బయటి నుంచి ఒకరికి హౌస్‌లోని వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా ఓ సారి కౌశల్‌కి కాల్ చేసిన వ్యక్తి, కౌశల్ ఆర్మీ గురించి చెప్పాడు. ‘మీ కోసం మేమున్నామని...’ భరోసా ఇచ్చాడు. ఆ సమయంలో ఆ అభిమానానికి కౌశల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అది కూడా కౌశల్‌కి క్రేజ్ పెరగడానికి కారణమైంది.
* సీజన్ మొత్తం నామినేట్ అవ్వడం...
‘బిగ్‌బాస్’ ఇచ్చిన సూచన మేరకు గీతామాధురి, కౌశల్‌ను సీజన్ మొత్తం నామినేట్ చేసింది. అప్పుడు కూడా పెద్దగా బాధపడకుండా ప్రశాంతంగా, హుందాగా వ్యవహారించాడు కౌశల్.
* హౌస్ మొత్తం కౌశల్‌ని టార్గెట్ చేయడం...
చివరి వారంలో హౌస్ సభ్యులెవ్వరూ రూల్స్ పాటించడం లేదంటూ అందర్నీ నామినేట్ చేస్తూ ప్రకటన చేశాడు బిగ్‌బాస్. దానికి కౌశల్ చేసిన పనిని కూడా కారణంగా చెప్పాడు. అయితే కౌశల్ చేసిన పని వల్లే అందరం నామినేట్ అయ్యామంటూ మిగిలిన సభ్యులందరూ కౌశల్‌పై విరుచుకుపడ్డారు. అయినా ప్రశాంతంగా ఉన్న కౌశల్... ఒకానొక సందర్భంలో టెంపర్ కోల్పోయి... ‘నేనేమైనా మాట్లాడితే కుక్కల్లా ఎగబడుతున్నారంటూ’ వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ కౌశల్‌కి నెగిటివ్ అవుతుందని అనుకున్నారంతా. కాని ఇది కూడా కౌశల్‌కి ప్లస్ అయ్యింది. లాస్ట్ వీక్ అందర్నీ నామినేట్ చేయడం గేమ్ ప్లాన్ అని తెలుసుకోకుండా తనపై ఎగబడినవారిని అలా అనడంలో తప్పు లేదంటూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు.
bigg boss 2, బిగ్‌బాస్ 2, బాబు గోగినేని, నాని, geetha madhuri, koushal, babu gogineni, nandini, హిందీ బిగ్‌బాస్ 12, kaushal army, kaushal army 2k walk, కౌశల్ ఆర్మీ, big boss telugu vote, bigg boss vote, telugu bigg boss vote, bigg boss 2 telugu vote, bigg boss telugu voting vote, bigg boss telugu, big boss 2 telugu vot,e bigg boss telugu vote 2018, bigg boss winner kaushal, Kaushal army, కౌశల్ ఆర్మీ, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ విన్నర్
* మిగిలిన పార్టిసిపెంట్ల ప్రవర్తన...
కౌశల్‌పై ప్రేక్షకుల్లో ఇంత ఫాలోయింగ్ రావడానికి మిగిలిన పార్టిసిపెంట్ల ప్రవర్తన కూడా ప్రధాన కారణమైంది. కౌశల్ ఏం మాట్లాడినా మొఖం మీదే మాట్లాడేవాడు. కాని మిగిలిన వాళ్లు వెనక మాట్లాడేవాళ్లు. కౌశల్ గురించి నానా రకాలుగా మాట్లాడుకునేవాళ్లు. ఇది జనాలకు నచ్చలేదు. ఇదే కాకుండా సామ్రాట్- తేజస్వితో రొమాన్స్ చేయడం, తనీశ్‌లో షార్ట్ టెంపర్, దీప్తి సునయన, నందినీ రాయ్‌లతో రొమాన్స్ చేయడం, దీప్తి నల్లమోతు సేఫ్ గేమ్, గీతామాధురిలో కొన్ని పాజిటివ్స్ ఉన్నా... సామ్రాట్‌తో క్లోజ్‌గా ఉండడం, ఆమె చేసే కొన్ని చిలిపి పనులు జనాలకు చికాకు తెప్పించాయి. ఇవన్నీ కలిసి కౌశల్ ఆర్మీని కొంత కొంత పెంచుతూ, కొండంతలు చేశాయి. చివరికి వార్ వన్ సైడ్... కాదు కాదు, అంతకు మించిన విజయాన్ని కౌశల్‌కి అందించాయి.
Published by: Ramu Chinthakindhi
First published: October 1, 2018, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading