బిగ్‌బాస్: కౌశల్ క్లీన్ స్వీప్... ఓటింగ్‌లో సరికొత్త రికార్డ్స్!

‘బిగ్‌బాస్’ చరిత్రలోనే పెను సంచలనం... పూర్తి ఏకపక్షంగా సాగిన సెకండ్ సీజన్ ఫైనల్ ఓటింగ్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 30, 2018, 2:07 PM IST
బిగ్‌బాస్: కౌశల్ క్లీన్ స్వీప్... ఓటింగ్‌లో సరికొత్త రికార్డ్స్!
కౌశల్, నాని
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 30, 2018, 2:07 PM IST
వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్‌బాస్’ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం ప్రసారమయ్యే ఫైనల్ ఎపిసోడ్‌తో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. అయితే ఫైనల్ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాకుండానే ‘బిగ్‌బాస్’ టైటిల్ విన్నర్ కౌశల్ అనే ప్రచారం బాగా జరుగుతోంది. సోషల్ మీడియాలో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ అంటూ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అంతకు మించి ఓటింగ్ గురించి వస్తున్న ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే బిగ్‌బాస్ పార్టిసిపెంట్ కౌశల్‌కి వచ్చిన ఓట్ల సంఖ్య.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కౌశల్‌కి ఏకంగా 39 కోట్ల 50 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని టాక్. ఈ స్థాయిలో ఓ పార్టిసిపెంట్‌కి ఓట్లు రావడం ‘బిగ్‌బాస్’ చరిత్రలోనే ఓ సంచలనం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమం చూసేవారిలో మెజారిటీ శాతం మంది కౌశల్‌కే ఓట్లు వేయడం... తమ అభిమాన పార్టిసిపెంట్ గెలవాలనే తపనతో మరిచిపోకుండా రోజూ ఓట్లు వేశారు. ఎక్కడ ఓట్లు తగ్గుతాయో అనే భయంతో రెండు మూడు అకౌంట్ల నుంచి ఓట్లు వేసిన వారు, ఓట్లతో పాటు మిస్డ్ కాల్స్ ఇచ్చిన వారూ ఉన్నారు. ఈ కారణంగానే కౌశల్‌కి ఈ స్థాయిలో ఓట్లు పడ్డాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ ‘బిగ్‌బాస్’ పెద్ద హిట్టయినా, ఇప్పటికి 10 సీజన్లు పూర్తి చేసుకున్నా ఈ స్థాయిలో మాత్రం ఎవ్వరికీ ఓట్లు రాలేదు.

కౌశల్ క్లీన్ స్వీప్ చేయడంతో రెండో స్థానంలో ఉన్న గీతా మాధురికి 1.67 కోట్ల ఓట్లు మాత్రమే దక్కాయి. తనీశ్‌కి 1.36 కోట్ల ఓట్లు రాగా, దీప్తి నల్లమోతుకు 98 లక్షల దాకా ఓట్లు దక్కాయి. లక్కీగా ఫైనల్ చేరిన సామ్రాట్‌కి కేవలం 37 లక్షల ఓట్లు మాత్రమే దక్కడం విశేషం. మొదటి సీజన్‌తో పోలిస్తే సెకండ్ సీజన్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. మొదటి సీజన్‌లో అర్చనకి పెద్దగా ఓట్లు రాకపోయినా... నవదీప్, హరితేజ కూడా బాగానే ఓట్లు రాబట్టుకోగలిగారు. ఫైనల్ ఫైట్‌లో టాప్ 3లో నిలిచిన ఆదర్శ్, హరితేజ, శివబాలాజీ మధ్య ఓట్ల తేడా పెద్దగా లేదని హోస్ట్ ఎన్.టీ.ఆర్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం పూర్తిగా వన్ వేలో సాగింది ఓటింగ్.

First published: September 30, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...