బిగ్ బాస్ హౌస్‌లో దూషించుకున్న లేడీ కంటెస్టెంట్స్

Bigg Boss Tamil 3 | బిగ్ బాస్ తమిళ్ 3 రసవత్తరంగా సాగుతోంది. హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్స్ వనిత విజయ్ కుమార్, షెరిన్ పరస్పరం దూషించుకున్నారు.

news18-telugu
Updated: September 5, 2019, 10:06 AM IST
బిగ్ బాస్ హౌస్‌లో దూషించుకున్న లేడీ కంటెస్టెంట్స్
వనిత విజయ్ కుమార్(ఫైల్ ఫోటో)
  • Share this:
బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 73 బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రసారం కాగా...74వ ఎపిసోడ్ ఇవాళ(గురువారం) ప్రసారంకానుంది. కంటస్టెంట్స్ మధ్య తరచూ చోటుచేసుకుంటున్న గొడవలు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.సినీ నటి వనిత విజయ్ కుమార్ తరచూ సహచర కంటెస్టెంట్స్‌తో వాగ్వివాదానికి దిగుతూ బిగ్ బాస్ షోను రక్తకట్టిస్తున్నారు.

తాజాగా సహ కంటెస్టెంట్ షెరిన్‌ను ఉద్దేశించి వనిత విజయ్ కుమార్ చేసిన కామెంట్స్ హౌజ్‌లో పెద్ద దుమారాన్నే లేపాయి. దర్శన్‌తో షెరిన్ అఫైర్ నడుపుతోందంటూ వనిత విజయ్ కుమార్ చేసిన కామెంట్స్‌కు షెరిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తమ బంధాన్ని అఫైర్‌గా ఎలా కామెంట్ చేస్తావంటూ వనితపై షెరిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘నీకు ఇంకిత జ్ఞానం లేదంటూ’ వనితపై షెరిన్ మండిపడింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోతో తేటతెల్లమవుతోంది.
ఇన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్న ఇద్దరి మధ్య రగడ మొదలుకావడంతో షో ఎలాంటి కొత్త మలుపుతిరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటోంది.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>