శ్యామల బయటికి... ‘బిగ్‌బాస్ లీక్స్’ ఈ వారం నామినేషన్స్‌లో వీరే!
ఎపిసోడ్‌కు ముందే బయటికి వచ్చేసిన నామినేషన్స్ లిస్ట్... క్రేజ్ కారణంగా కార్యక్రమం మరో వారం రోజులు పొడగింపు... సెప్టెంబర్ 30న ఫైనల్ ఎపిసోడ్!

యాంకర్ శ్యామల, అమిత్, దీప్తి నల్లమోతు
- News18 Telugu
- Last Updated: September 10, 2018, 3:45 PM IST
‘బిగ్‌బాస్’ సీజన్ 2 కార్యక్రమం దాదాపు చివరి దశకు చేరుకుంది. కొన్నాళ్లుగా హౌస్‌లో ఎవరు ఉండాలి? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అనే విషయాలను డిసైడ్ చేస్తూ వచ్చింది కౌశల్ ఆర్మీ. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కౌశల్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే నూతన్ నాయుడిని హౌస్‌లో ఉండేలా చూసుకోవాలని ప్రయత్నించిన కౌశల్ ఆర్మీ వ్యూహాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. డబుల్ ఎలిమేషన్ కారణంగా ఒకే వారంలో ఇద్దరు కామన్ మ్యాన్లు (గణేశ్, నూతన్ నాయుడు) హౌస్ నుంచి బయటికి వచ్చేశారు.
గత వారం కూడా అమిత్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం పక్కా... అని అంతా డిసైడ్ అయిపోయారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, శనివారం ఉదయం వచ్చిన బిగ్‌బాస్ లీక్స్‌ను నిజం చేస్తూ యాంకర్ శ్యామల హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. కొన్నాళ్ల ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి, రీఎంట్రీ ఇచ్చిన శ్యామల... మొదటిసారి అన్యాయంగా ఎలిమినేట్ అయ్యాననే ఫీలింగ్‌లో ఉండింది. ఆమె అభిమానులు కూడా అదే భావించేవారు. ఈ వారం పక్కాగా బయటికి వెళ్లడంతో ఆ ఫీలింగ్ మాయమైంది.
ఎప్పుడూ శుక్ర, శనివారాల్లో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం బయటకు వచ్చేది. ఈసారి ఏకంగా నామినేషన్లలో ఎవరు ఉండబోతున్నారనే విషయం ఎపిసోడ్‌కు ముందే బయటికి వచ్చేసింది. ఈ వారం నామినేషన్ల లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే... కౌశల్, అమిత్, దీప్తి, గీతా మాధురి, రోల్ రిడా. కౌశల్ ఈ సీజన్ మొత్తానికి నామినేషన్లలో ఉండాలని బిగ్‌బాస్ నిబంధన కారణంగా అతను ఆ లిస్టులో చేరగా... మిగిలిన వారు టాస్క్ సరిగా పూర్తిచేయని కారణంగా నామినేషన్లలోకి వచ్చినట్టు తెలుస్తోంది. తనీశ్, సామ్రాట్ మాత్రమే నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే మరో రెండు వారాల్లో ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ముగించాలి. కానీ రెస్పాన్స్ భారీగా ఉండడం వల్ల సెప్టెంబర్ 30న ఫైనల్ ఎపిసోడ్ ఉండేలా, కార్యక్రమాన్ని మరో వారం పొడగించారని సమాచారం. గత రెండు వారాలుగా అంచుల్లో తప్పించుకుంటున్న అమిత్... ఈ వారం ఎలిమినేట్ అయినా మరో 6 పార్టిసిపెంట్లు ఉంటారు. కాబట్టి ఇంకొకరిని నెక్ట్స్ వీక్ ఎలిమినేట్ చేసి... మిగిలిన ఐదుగురితో ఫైనల్ వీక్ సాగేలా ప్లాన్ చేస్తోంది స్టార్ మా యాజమాన్యం.ఇవీ చదవండి...
కౌశల్ ఆర్మీ క్రేజ్.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!
కౌశల్ ఆర్మీ అంటే తిట్లే కాదు.. ఇలా కూడా చేస్తుంది
Video: కౌశల్ ఆర్మీ 2కె వాక్... క్రేజ్ మామూలుగా లేదబ్బా!

Loading...