Home /News /trending /

BIG SNAKE PASSES THROUGH THE ROAD WHILE PEOPLE FROM CAR COME DOWN TO TAKE PHOTOS WITH IT IN BRAZIL AK

Viral Video: రోడ్డు మీద అసలు సిసలు అనకొండ.. ఇది కదా వైరల్ వీడియో అంటే.. చూసి తీరాల్సిందే..

నడిరోడ్డుపై పెద్ద పాము( Image: Instagram)

నడిరోడ్డుపై పెద్ద పాము( Image: Instagram)

Big Snake: పామును చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాము చూసి కారు ఆపారు. అది ఎక్కడ తమ మీదకు దాడి చేస్తుందో అని భయపడ్డారు.

    పాములంటే కొందరికి భయం. మరికొందరికి ఆసక్తి. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోతారు చాలామంది. అది ఎంత భయంకరంగా ఉన్నా.. దాని చూసేందుకు ప్రయత్నిస్తారు. మరి అలాంటి పాము అనకొండ సైజులో ఉంటే ఇంకేమైనా ఉందా ? చూసే వాళ్ల గుండెల్లో రైలు పరిగెడతాయి. అక్కడి నుంచి అంతా పరుగులు అందుకుంటారు. కానీ అనకొండ సైజులో ఉండే పాము మెల్లిమెల్లిగా ముందుకు సాగితే మాత్రం.. అక్కడున్న వాళ్లకు ఓ విజువల్ వండరే. ఇలాంటి దృశ్యం మళ్లీ చూస్తామో లేదో అని అంతా ఆ పామును చూసేందుకు ఎగబడతారు.

    ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బ్రెజిల్ దేశంలో ఓ పెద్ద అనకొండ సైజు పాము రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలో ఉన్న పెద్ద డివైడర్‌ను కూడా దాటుకుంటూ వెళ్లిపోయేందుకు సిద్ధపడింది. కానీ ఆ పామును చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాము చూసి కారు ఆపారు. అది ఎక్కడ తమ మీదకు దాడి చేస్తుందో అని భయపడ్డారు. కానీ కొద్దిసేపటికే అలాంటి ప్రమాదం ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చారు. ఆ పాము తన దారిని తాను వెళుతుందని డిసైడయ్యారు.




    ఇంకేముంది మనోళ్లు ఫోన్లు పట్టుకుని దాన్ని షూట్ చేసేందుకు రెడీ అయ్యారు. కొందరైతే దానికి కాస్త దూరంగా నిలబడి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను Snake.wild అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో భాగస్వామ్యం చేయబడింది. ప్రజలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. వీడియో దాదాపు 2 నిమిషాల నిడివి ఉంది.

    Viral video: 80 ఏళ్ల వయసులో జిమ్.. బామ్మ వర్కవుట్స్ మాములుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

    Dance: విధిరాతకే సవాల్ విసిరింది.. ఒంటి కాలుతో దుమ్మురేపే స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 40 వేల మందికి పైగా చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో అనకొండను చూసేందుకు, దానిని వీడియో చేయడానికి కార్ల నుండి బయటకు వచ్చిన వారి ధైర్యాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. తమకు కూడా ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Snakes, Viral Video

    తదుపరి వార్తలు