హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: రెయిన్‌బో స్నేక్.. ఈ పామును చూస్తే వామ్మో కాదు.. వావ్ అంటారు..

Viral Video: రెయిన్‌బో స్నేక్.. ఈ పామును చూస్తే వామ్మో కాదు.. వావ్ అంటారు..

రెయిన్ బో స్నేక్ శాస్త్రీయ నామం ఫరాన్సియా ఎరిత్రోగామ (Farancia Erytrogramma). ఇవి ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి

  పాము పేరు వింటనే మనలో చాలా మందికి భయం వేస్తుంది. ఇక కంటికి కనిపించిందా.. ప్రాణాలరచేత పట్టుకొని పరుగెత్తుతారు. చివరకు జూలో చూసినా వణికిపోతుంటారు. కానీ ఈ పామును చూస్తే.. 'వామ్మో' అనరు. 'వావ్' అంటారు. ఎందుకంటే అంత అందంగా.. చూడముచ్చటగా ఉంటుంది. సాధారణంగా పాములు ఏదో ఒక రంగులో మాత్రమే ఉంటాయి. మహా అయితే రెండు రంగులు ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం రంగు రంగులుగా ఉంది. చాలా కలర్‌పుల్‌గా కనువిందు చేస్తోంది. అచ్చం ఇంద్రధనస్సులా మెరిసిపోతుంది. దీన్నే రెయిన్ బో స్నేక్‌గా పిలుస్తున్నారు. ది రెప్టైల్ జూ అనే ఇన్‌స్టగ్రామ్ యూజర్ ఆ రెయిన్ బో స్నేక్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇది అందమైనది మాత్రమే కాదు.. మంచి హృదయం కలిగిన పాము. అని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఫొటోను పోస్ట్ చేయగా.. దాదాపు 44 వేల మంది లైక్ చేశారు. ఇలాంటి పామును తాము ఎప్పుడూ లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

  ఓ మహిళ ఈ రెయిన్ బో పామును మెడలో వేసుకుంది. అది అటూ ఇటు కదులుతూ చాలా అందంగా కనిపించింది. ఆ వీడియోను కూడా ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం పోస్ట్ చేయగా 8వేల మంది వీడియోను లైక్ చేశారు. ఒక పామును చూసి ఫస్ట్ టైమ్ ముచ్చటేస్తుంది.. ఎంత క్యూట్‌గా ఉందో.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత అందమైన, పెద్ద పామును తాను ఎప్పుడూ చూడలేదని మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ పాము మేము ఉండే చోట ఉంటే ఎన్ని సెల్ఫీలు తీసుకునే వాడినో అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.

  కాగా, పైన చూపించిన పాము.. కాలిఫొర్నియా (అమెరికా) ఫౌంటేన్ వ్యాలీలో ఉన్న ది రెప్టైల్ జూలో ఉంది. అక్కడున్న వన్యప్రాణుల్లో కెల్లా ఇదే ప్రత్యేక ఆకర్షణగా ఉంది. జూ చూసేందుకు వచ్చే సందర్శకులు రెయిన్ బో స్నేక్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడుతుంటాు. ఈ పాము శాస్త్రీయ నామం ఫరాన్సియా ఎరిత్రోగామ (Farancia Erytrogramma). ఇవి ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 36 నుంచి 48 ఇంచుల వరకు పెరుగుతాయి. ఇంకొన్ని పాములైతే గరిష్ఠంగా 66 ఇంచుల వరకు ఉంటాయి.

  First published:

  Tags: America, Snake, Snakes, Viral Videos

  ఉత్తమ కథలు