ఏ భాష సినిమా హీరోకైనా అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోని కలిసేందుకు, అతడితో మాట్లాడాలని ఫ్యాన్స్ ఆశపడుతూ ఉంటారు. కాని హీరోలు మాత్రం వాళ్లను దూరం నుంచి పలకరించడం లేదంటే చూసి చూడనట్లుగా వెళ్లిపోతుంటారు. షూటింగ్లో అయినా లేక ఏదైనా మూవీ ఫంక్షన్‌లోనైనా ఇదే జరుగుతుంది. కాని భోజ్‌పూరి (Bhojpuri Hero) పవర్ స్టార్ పవన్ సింగ్ (Pawan Singh) మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. తనను చూసేందుకు ఓ దివ్యాంగుడైన అభిమాని(Disabled fan )బిహార్ (Bihar) నుంచి కుర్లాకు వచ్చాడని తెలుసుకొని అతనికి ఓ సోదరుడిగా సకల మర్యాదలు చేసి సంతోష పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. భోజ్‌పూరి పవర్ స్టార్ పవన్ సింగ్ ముంబై(Mumbai)లో ఉంటున్నాడు. బీహార్‌లోని బెగుసరాయ్( Begusarai)జిల్లాలోని బెహత్(Behat)కు చెందిన కుందన్ (Kundan)అనే దివ్యాంగుడు పవన్ సింగ్‌కు వీరాభిమాని. ఒక్కసారైనా హీరోని చూడాలని మూడ్రోజుల ముంబైకి వచ్చి హీరో ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నాడు. ఓ వికలాంగుడైన అభిమాని తనకోసం వచ్చాడని తెలిసి హీరో ఇంటి ముందుకు వచ్చి అతనితో ఆప్యాయంగా మాట్లాడాడు. కుందన్‌కు రెండు కాళ్లు లేకపోవడం వల్ల చక్రాల పీటపై హీరో దగ్గరకు రావడం చూసి మరింత జాలిపడ్డాడు. అతనితో మాట్లాడేందుకు నేలపై కూర్చుకొని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడు హీరో పవన్ సింగ్. తాను పాట్నా నుంచి ట్రైన్లో కుర్లాకు వచ్చానని ..అక్కడి నుంచి ఇలా ముంబైలో మీ అడ్రస్ తెలుసుకొని వచ్చానని చెప్పడంతో హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే అతడ్ని ఇంట్లోకి తీసుకెళ్లి ఇష్టమైన భోజనం పెట్టించాడు. అంత పెద్ద హీరో కుందన్ లాంటి అభిమాని కోసం సమయం కేటాయించడమే కాకుండా కుందన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంతా తెలుసుకున్నాడు. చివరగా ఓ ఖరీదైన సెల్‌ఫోన్‌ని కుందన్కి బహుమతిగా ఇచ్చాడు హీరో పవన్‌సింగ్. కుందన్ తిరిగి ఇంటికి వెళ్లే ఏర్పాట్లు చేయమని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించాడు.
రియల్ హీరో..
అభిమాన నటుడ్ని చూడాలన్న కోరిక తీరడంతో వికలాంగుడు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. హీరో పవన్‌సింగ్ సైతం సెల్‌ఫోన్ ఇచ్చి..నువ్వు నా అభిమానివి కాదు..సోదరుడివి అంటూ అప్యాయంగా మాట్లాడటంతో మరింత ఉబ్బితబ్బిబ్బిపోయాడు. భోజ్‌పురి పవర్ స్టార్ తన అభిమాని కోరిక తీర్చడంతో పాటు అతడిపై చూపించిన ప్రేమాభిమానాలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పవన్ సింగ్ ఔదార్యం చూస్తున్న నెటిజన్లు రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood actor, Mumbai, Viral Video