Bharat box office day 2: ‘భారత్’ మూవీ కలెక్షన్స్ @ రూ.71 కోట్లు

Bharat Box Office Day 2 | సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లేటెస్ట్ మూవీ ‘భరత్’ రెండో రోజు దాదాపు రూ.30 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ.71 కోట్లకు చేరాయి.

news18-telugu
Updated: June 7, 2019, 12:02 PM IST
Bharat box office day 2: ‘భారత్’ మూవీ కలెక్షన్స్ @ రూ.71 కోట్లు
Bharat Box Office Day 2 | సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లేటెస్ట్ మూవీ ‘భరత్’ రెండో రోజు దాదాపు రూ.30 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ.71 కోట్లకు చేరాయి.
  • Share this:
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రంజాన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.71 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజైన మొదటి రోజు సల్మాన్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.42.3 కోట్ల కలెక్షన్స్ సాధించగా...రెండో రోజు(గురువారం) మరో రూ.29-రూ.30 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు ఓపనింగ్స్‌తో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ 25 శాతానికి పైగా తగ్గాయి. ఈ వారాంతంలో ‘భరత్’ కలెక్షన్స్ పుంజుకోవచ్చని అంచనావేస్తున్నారు.

బాలీవుడ్‌ చరిత్రలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన నాలుగో చిత్రంగా ‘భరత్’ రికార్డు సృష్టించగా...2019లో అత్యధిక ఫస్ట్‌డే కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా గుర్తింపు సాధించింది. 2019లో విడుదైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ రూ.53 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సల్మాన్ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగానూ ‘భరత్’ గుర్తింపు సాధించింది. 2015 దిపావళికి విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫస్ట్ డే కలెక్షన్స్ (రూ.39.32 కోట్లు) రికార్డును ఇది అధిగమించింది.

‘భరత్’ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుండడంతో తన ఫ్యాన్స్‌కు సల్మాన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading