హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇలాంటి Zoom Call నెవర్ బిఫోర్ -ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని పీకేసిన Better.com సీఈవో -ఇదే ఆ Video

ఇలాంటి Zoom Call నెవర్ బిఫోర్ -ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని పీకేసిన Better.com సీఈవో -ఇదే ఆ Video

జూమ్ కాల్ లోనే 900 మంది ఉద్యోగుల్ని తొగించిన విశాల్ గార్గ్

జూమ్ కాల్ లోనే 900 మంది ఉద్యోగుల్ని తొగించిన విశాల్ గార్గ్

‘‘ఇలాంటి వార్త మీరెవరూ వినాలని కోరుకోరు. కానీ ఒకవేళ మీరు దురదృష్టవశాత్తూ ఈ కాల్​ గ్రూప్​లో ఉన్నట్లయితే.. మీ ఉద్యోగాన్ని తక్షణమే తొలగిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ మార్కెట్​ మందగమనం, కంపెనీ నష్టాలు, పనితీరు ఆధారంగా తొలగించాల్సిన అనివార్యత ఏర్పడింది.." అంటూ..

ఇంకా చదవండి ...

    ప్రైవేట్​ రంగంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగిస్తారోనన్న భయం ఉద్యోగులను వెంటాడుతోంది. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇప్పటికే నిర్వహణ భారంతో అనేక కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అయితే ఉద్యోగం నుంచి తీసివేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ విషయాన్ని సదరు ఉద్యోగికి కనీసం నెల రోజుల ముందు చెప్పాలి. కానీ అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో జూమ్​ కాల్​ మీటింగ్​లోనే ఏకంగా 900 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్​.కామ్​కు భారత్​, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్నాయి. డిసెంబర్​ 1న భారతదేశం, అమెరికాలోని ఉద్యోగులతో సీఈవో విశాల్ గార్గ్ జూమ్​ మీటింగ్​ నిర్వహించారు. అందరూ రెగ్యులర్​ జూమ్​ మీటింగ్​ అనుకున్నారు. కానీ, ఎవ్వరూ ఊహించని వార్త చెప్పి షాకిచ్చారు.

    జూమ్​ కాల్​లో ఉద్యోగులతో మాట్లాడుతూ ‘‘ఇలాంటి వార్త మీరెవరూ వినాలని కోరుకోరు. కానీ ఒకవేళ మీరు దురదృష్టవశాత్తూ ఈ కాల్​ గ్రూప్​లో ఉన్నట్లయితే.. మీ ఉద్యోగాన్ని తక్షణమే తొలగిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ మార్కెట్​ మందగమనం, కంపెనీ నష్టాలు, పనితీరు ఆధారంగా తొలగించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నా కెరీర్​లో ఇది రెండోసారి. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో బాధపడి ఏడ్చాను కూడా. కానీ ఇప్పుడు స్ట్రాంగ్​గా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎవరి ఉద్యోగం పోయింది అనేది కంపెనీ హెచ్​ఆర్​ డిపార్ట్​మెంట్​ నుంచి ఈ–మెయిల్ వస్తుంది. ఆయా ఉద్యోగులకు ఒక నెల రోజుల వేతనంతో పాటు రెండు నెలల కవర్​ అప్​ లభిస్తుంది.” అని విశాల్​ గార్గ్​ తన ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పారు.

    etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్



    ' isDesktop="true" id="1113914" youtubeid="gpjqbvLkPUw" category="trending">

    సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్న వీడియో..

    గతేడాది నవంబర్​లో వ్యాపార పత్రిక ఫోర్బ్స్​లో విశాల్​ కాగ్​ స్థానం సంపాదించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా 900 మంది ఉద్యోగులను తొలగించడంపై సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఉద్యోగి ఇటీవల సోషల్​మీడియాలో పోస్ట్​ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంపై ఉద్యోగస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కంపెనీ వాదన మాత్రం మరోలా ఉంది. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు కనీసం సగటున 2 గంటలు కూడా పనిచేయడం లేదని, దీని వల్ల నష్టాలు వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల ఉత్పాదకత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకోక తప్పట్లేదని సంస్థ వెల్లడించింది.

    First published:

    Tags: VIRAL NEWS

    ఉత్తమ కథలు