హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: పార్కింగ్ సెన్సార్‌లా పనిచేసిన కుక్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral video: పార్కింగ్ సెన్సార్‌లా పనిచేసిన కుక్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

(Image Credit: twitter)

(Image Credit: twitter)

కుక్కల వీడియోలను, అవి చేసే తుంటరి పనులను.. వాటి యజమానులు విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ కుక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్త ఎలాంటిదైనా సంచలనం కావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. అందులోనూ పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే గంటల వ్యవధిలోనే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కుక్కల వీడియోలను, అవి చేసే తుంటరి పనులను.. వాటి యజమానులు విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ కుక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కారు పార్కింగ్ చేయడంలో సహాయపడిన ఆ శునకం నెటిజన్ల మనస్సును దోచుకుంది. పార్కింగ్ సెన్సార్ లా పనిచేసి, తన యజమానికి అది సాయం చేసింది. హ్యూమర్ అకౌంట్ అనే ఓ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. "బెస్ట్ బార్కింగ్ సెన్సార్" అని క్యాప్షన్ ఇస్తూ వీడియోను పంచుకున్నారు.

వీడియో పరిశీలిస్తే.. ఓ షాపింగ్ మాల్(ప్రదేశం ఎక్కడో స్పష్టత లేదు) బయట పార్కింగ్ స్థలం ఉండగా.. కారు పార్క్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో కారును సరిగ్గా పార్క్ చేసేందుకు వెనకున్న ఓ కుక్క.. కాళ్లతో సైగలు చేస్తూ, పార్కింగ్ బోర్డర్ మార్కును దాటిన తర్వాత అరుస్తూ డ్రైవర్ ను అప్రమత్తం చేసింది. సరిగ్గా పార్కింగ్ సెన్సార్ ఎలా పనిచేస్తూందో అలా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కుక్క ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అవుతూ, విశేషంగా స్పందిస్తున్నారు.

నెటిజన్లు ఫిదా..

ఇలాంటి ఫీచర్ కారులో వస్తుందా అని ఒకరు స్పందించగా.. కుక్క అద్భుతం చేసింది అని మరోకరు ట్విట్టర్లో వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. సెన్సార్ కంటే ఈ కుక్కే ఎంతో ఉత్తమంగా పనిచేసింది అని ఇంకొకరు స్పందించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే 33వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన హ్యూమర్ అండ్ యానిమల్సిస్ ఖాతాలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. పార్కింగ్ సెన్సార్లో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే వీడియో ఫేస్ బుక్ లో వూఫ్ వూఫ్ పేరుతో షేర్ చేశారు.


కారు పార్కింగ్ చేసే వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. పెద్దగా కష్టపడకుండా ఇలాంటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి మిలియన్ల వ్యూస్ అందుకున్నారు పలువురు ఔత్సాహికులు. శునకాలతో డ్యాన్స్ చేయించడం, యోగా చేయించడం, నవ్వించడం, ఆటపట్టించడం, శునకాలను పైట్ చేయించడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.

First published:

Tags: Dog, Viral Video

ఉత్తమ కథలు