యడియూరప్పకు పండ్ల బుట్ట ఇచ్చిన మేయర్‌కు జరిమానా..

యడియూరప్పకు ప్లాస్టిక్ కవర్‌తో కప్పిన పండ్ల బుట్ట ఇచ్చిన మేయర్ గంగాంబిక (Image:News18Malayalam)

బెంగళూరులో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించారు. అయితే, మేయర్ గంగాంబిక ముఖ్యమంత్రికి ఇచ్చిన పండ్లబుట్ట ప్లాస్టిక్ కవర్‌తోనే చుట్టి ఉండడంతో ఆమెకు జరిమానా విధించారు.

  • Share this:
    కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు పండ్ల బుట్టను బహూకరించిన మహిళకు బెంగళూరు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడియూరప్ప ప్రమాణస్వీకారం చేయడంతో బెంగళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సాధారణంగా నేతలు కలిసినప్పుడు పూల బొకే ఇస్తుంటారు. కానీ, ఆమె పండ్ల బుట్టను ఇచ్చారు. అయితే, ఆ పండ్ల బుట్టను ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి ఉండడమే ఆమెకు జరిమానా పడేలా చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై దాడులు చేసి భారీ ఎత్తున జరిమానాలు విధించారు. కానీ, ఏకంగా మేయర్ కూడా రూల్స్‌ను ఉల్లంఘించడంతో ఆమెకు రూ.500 జరిమానా విధించారు.

    ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇవ్వడానికి పండ్ల బుట్ట తీసుకురావాల్సిందిగా తాను వేరేవారికి చెప్పానని, వారు చూసుకోకుండా ఇలా ప్లాస్టిక్ పేపర్ చుట్టిన దాన్ని తీసుకొచ్చారని మేయర్ వివరణ ఇచ్చారు. అయితే, చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, తనకు విధించిన జరిమానాను కచ్చితంగా కడతానని స్పష్టం చేశారు. బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు 9000 షాపుల్లో దాడులు చేసింది. 4000 వేల చిరు వర్తకుల వద్ద తనిఖీలు చేసింది. సుమారు 1.3 టన్నుల ప్లాస్టిక్‌‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే, రూ.32.96లక్షల జరిమానాలు కూడా వసూలు చేసింది.
    First published: