హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bengaluru Cash: కరెన్సీ వర్షం..! ఫ్లైఓవర్‌పై నుంచి నోట్ల కట్టలు విసిరేసిన ప్లేయర్‌

Bengaluru Cash: కరెన్సీ వర్షం..! ఫ్లైఓవర్‌పై నుంచి నోట్ల కట్టలు విసిరేసిన ప్లేయర్‌

కరెన్సీ మ్యాన్‌

కరెన్సీ మ్యాన్‌

Bengaluru Man Showers Cash : అది కర్ణాటకలోని బెంగుళూరు మహానగరం.. అందరూ ఆఫీస్‌కు వెళ్లే సమయం..! నిత్యం ట్రాఫిక్‌ జామ్‌తో రద్దీ రద్దీగా ఉండే కేఆర్‌ మార్కెట్ ఫ్లైఓవర్‌ మీదకి ఓ వ్యక్తి బ్యాగ్‌తో వచ్చాడు. అందులో నుంచి నోట్ల కట్టాలు తీశాడు. ఫ్లైఓవర్‌పై నుంచి కిందకి నోట్లను వదిలేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అది కర్ణాటకలోని బెంగుళూరు మహానగరం.. అందరూ ఆఫీస్‌కు వెళ్లే సమయం..! నిత్యం ట్రాఫిక్‌ జామ్‌తో రద్దీ రద్దీగా ఉండే కేఆర్‌ మార్కెట్ ఫ్లైఓవర్‌ మీదకి ఓ వ్యక్తి బ్యాగ్‌తో వచ్చాడు. అందులో నుంచి నోట్ల కట్టాలు తీశాడు. ఫ్లైఓవర్‌పై నుంచి కిందకి నోట్లను వదిలేశాడు. అంతే ఒక్క దెబ్బకు ఫ్లైఓవర్‌పైన ట్రాఫిక్‌ జామ్‌.. ఫ్లైఓవర్‌ కింద జనాల బారులు..! తాము వెళ్తున్న పని మరిచిపోయి మరీ.. ప్లైఓవర్‌ పైనుంచి జారుతున్న నోట్ల కట్టాలను పట్టుకునేందుకు నిలబడిపోయారు..! తీరా చూస్తే అవన్ని 10రూపాయల నోట్లు..! ఇక వెంటనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది. అయితే ట్రాఫిక్‌ కంట్రోల్‌ కావడానికి మాత్రం గంటల సమయం పట్టింది.

ఇంతకీ ఎవరా కరెన్సీ మ్యాన్‌..?

కేఆర్‌మార్కెట్ పై నుంచి నోట్లను జారవిడిచిన వ్యక్తిని ఓ మాజీ కబడ్డీ ఆటగాడిగా పోలీసులు గుర్తించారు. అతని పేరు అరుణ్‌.  అతను ఈవెంట్ మేనేజర్ కూడా. అయితే అరుణ్‌ ఎందుకలా చేశాడు..? ఎవరైనా చెబితే చేశాడా..? లేకపోతే కావాలనే జనాలను వెర్రివాళ్లను చేయడానకి చేశాడా..? లేక మానసిక సమస్యలేమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు కూడా ఇలాంటి ఘటనలే జరిగినట్లు యూజర్లు గుర్తు చేసుకుంటున్నారు.

గుజరాత్‌లో కూడా ఇలానే:

నెల రోజుల క్రితం గుజరాత్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గుజరాతీ జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ చేసిన భజన కార్యక్రమానికి రూ.40-50 లక్షల నగదు లభించింది.స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన కంటి ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. వారంతా గాయకులపై 10 రూపాయల నుంచి 500 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. ఇది మొత్తం లాస్ట్‌లో కౌంట్‌ చేస్తే రూ.50లక్షలకు చేరిందని గాధ్వీ చెప్పారు.

బకెట్ నిండా డబ్బులు:

2015లో కూడా వడోదరలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కార్యక్రమంలో గుజరాత్‌కు చెందిన స్థానిక బీజేపీ నేత ఒకరు గాయకుడిపై బకెట్ నిండా డబ్బుల వర్షం కురిపించారు. ఈ వీడియో అప్పట్లో ట్రెండింగ్‌ అయింది.

First published:

Tags: Bangalore, Bengaluru, Currency, Kabaddi

ఉత్తమ కథలు