మనలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలే (Private jobs) చేస్తుంటారు. వీటిలో శాలరీలు ఎక్కువగానే ఉంటాయి. అదే విధంగా, పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఉద్యోగులకు కడుపు నిండా తిండి, తగినంత నిద్ర సరిగ్గా ఉండవు. అందుకే చాలా మంది ఒబేసిటీ, నిద్రలేమితో (Sleeping problem) బాధపడుతుంటారు. ఇంకా కొన్ని ఉద్యోగాలలో షిఫ్ట్ ల విధానం ఉంటుంది. దీనిలో ప్రతివారానికి లేదా 15 రోజులకు ఒకసారి షిఫ్ట్ సమయాలు మారుతుంటాయి. దీంతో ఉద్యోగాలు చేసేవారి ఆరోగ్యంలో పెనుమార్పులు వస్తుంటాయి. తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు.
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు (Soft ware company) పలు వెసులు బాట్లు ఇస్తుంటాయి. కొన్నింటిలో వారానికి కేవలం ఐదు రోజుల పనిమాత్రమే ఉంటుంది. మరికొన్నింటిలో కంపెనీల ఆలవెన్స్ లు,బోనస్ లు, ఇంక్రిమెంట్ లు తదితర వెసులు బాట్లు ఇస్తుంటాయి. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ తమ ఉద్యోగులకు పనివేళల్లో కునుకు తీయడానికి సమయాన్ని కేటాయించి ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Official Announcement 📢 #sleep #powernap #afternoonnap pic.twitter.com/9rOiyL3B3S
— Wakefit Solutions (@WakefitCo) May 5, 2022
పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karantaka) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరులోని వేక్ ఫిట్ సొల్యుషన్స్ అనే (Wake fit Solutions) స్టార్టప్ కంపెనీ తమ ఉద్యోగులకు పనివేళల్లో కునుకు తీయడానికి ప్రత్యేకంగా అరగంట సమయాన్ని (30 minute power nap) కేటాయించింది. ప్రతి రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత.. 2 నుంచి 2.30 నిముషాల వరకు కునుకు తీసే సమయంగా కేటాయించింది. ఈ మేరకు..‘రైట్ టు న్యాప్’ అంటూ.. వేక్ ఫిట్ కో ఫౌండర్ చైతన్య రామలింగ గౌడ్ తన ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించారు.
పనివేళ్లలో చిన్న కునుకు తీస్తే.. ఆ తర్వాత మెదడు, మునుపటి కంటే 33 శాతం యాక్టివ్ గా పనిచేస్తుందని నాసా (nasa) అధ్యయనం లో తెలిపింది. అదే విధంగా పనివేళల్లో గ్యాప్ తీసుకుని పని ప్రారంభిస్తే.. పనిలో ఉత్పాదకత (Productivity) పెరుగుతుందని పలు అధ్యయనాల్లో ఇది వరకే బయట పడ్డాయి. ప్రస్తుతం తమ కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Karnataka, Sleeping, Soft ware, VIRAL NEWS