Guinness World Record: వీడు పిల్లోడు కాదు పిడుగు.. ఒకటిన్నర నిమిషాల్లోనే గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

Credit: Guinness world record

ఆటబొమ్మల్లో రూబిక్ క్యూబ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్లనే తేడా లేకుండా అందరూ రోబిక్ క్యూబ్‌లో అన్ని రంగులూ మ్య

  • Share this:
ఆటబొమ్మల్లో రూబిక్ క్యూబ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్లనే తేడా లేకుండా అందరూ రోబిక్ క్యూబ్‌లో అన్ని రంగులూ మ్యాచ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారే ఈ ఆటలో విజయం సాధిస్తారని చాలామంది నమ్ముతారు. ఒక్క క్యూబ్‌లో రంగులన్నింటినీ జత చేయడమే కష్టం. అలాంటిది ఒక బాలుడు ఒకేసారి మూడు రోబిక్ క్యూబ్‌లను పరిష్కరించి గిన్నిస్ రికార్డు సాధించాడు. బెంగళూరుకు చెందిన అధర్వ భట్ అనే ఎనిమిదేళ్ల విద్యార్థి ఒకటిన్నర నిమిషాల్లోనే మూడు రూబిక్ క్యూబ్‌లను సాల్వ్ చేశాడు. తన రెండు చేతులతో రెండు క్యూబ్‌లను, పాదాలతో ఒక క్యూబ్‌ను పరిష్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అధర్వ ఈ రికార్డును కేవలం ఒక నిమిషం 29.97 సెకన్లలోనే సాధించడం విశేషం. ఈ వీడియోను '2hands + 2Feet= 3Cubes Solved' అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. గతవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఫేస్‌బుక్ పేజీలో కూడా దీన్ని షేర్ చేశారు. అధర్వ ఒక కుర్చీలో కూర్చొని.. రెండు చేతులతో ఒక్కో క్యూబ్‌ను, రెండు కాళ్లతో మరో క్యూబ్‌ను ఒకేసారి సాల్వ్ చేశాడు. పక్కనే ఒక వ్యక్తి టైమర్ పట్టుకొని కూర్చున్నాడు. మూడు క్యూబ్‌లలో రంగులు మ్యాచ్ చేసేందుకు రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పట్టడం విశేషం.



క్యూబ్‌లతో రికార్డులు
రోబిక్ క్యూబ్‌లతో చాలామంది వ్యక్తులు అసాధారణ రికార్డులు నెలకొల్పారు. గత ఏడాది చైనాకు చెందిన క్యూ జియాన్యూ అనే బాలుడు కూడా గిన్నిస్ రికార్డు సాధించాడు. అతడు రెండు కాళ్లు, రెండు చేతులతో.. ఒక నిమిషం 36.39 సెకండ్లలో ఈ టాస్క్ పూర్తి చేశాడు. ఈ రికార్డును అధర్వ తాజాగా బ్రేక్ చేశాడు. గత నెలలో మరో భారత బాలిక కళ్లకు గంతలు కట్టుకొని వేగంగా రోబిక్ క్యూబ్స్‌ను సాధించింది. గత సంవత్సరం చెన్నైకి చెందిన 25 ఏళ్ల వ్యక్తి నీటి లోపల ఊపిరి బిగబట్టి.. రెండు నిమిషాల్లో ఆరు క్యూబ్‌లను సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
First published: