HOME »NEWS »TRENDING »bengali actress saayoni ghosh shares controversial old tweet condom shivaling went viral netizens slams her ms gh

Saayoni Ghosh: శివలింగంపై కండోమ్.. టాలీవుడ్ హీరోయిన్ ను ఉతికారేస్తున్న నెటిజన్లు..

Saayoni Ghosh: శివలింగంపై కండోమ్.. టాలీవుడ్ హీరోయిన్ ను ఉతికారేస్తున్న నెటిజన్లు..
సాయోని ఘోష్ (Image credits Twitter)

Saayoni Ghosh: ఫిబ్రవరి 18, 2015లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆకృత్యాన్ని ఆమె ట్వీట్ చేయటం పెద్ద వివాదానికి దారితీసింది. ఆతరువాత తీరిగ్గా తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని.. ఇది ఆకతాయిలు చేసిన అతి చెడ్డ చర్యగా పేర్కొని ఈ వివాదం నుంచి స్మార్ట్ గా బయటపడ్డారు. కానీ ఈ వివాదం తాజాగా తెరమీదకు ఎందుకు వచ్చిందంటే...?

  • News18
  • Last Updated: January 18, 2021, 16:09 IST
  • Share this:
ప్రముఖ బెంగాలీ నటి సాయోని ఘోష్ (saayoni Ghosh) మరోమారు ట్రోలింగ్ బారినపడ్డారు. శివలింగంపై ఓ మహిళ కండోమ్ వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Social media viral) కావటంతో సాయోనిని నెటిజనులు ఉతికి ఆరేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇది ఎప్పుడో 2015లో సాయోని చేసిన ట్వీట్ (tweet) కాగా.. ఆమె తెలివిగా ఈ వివాదం నుంచి అప్పట్లో బయటపడ్డారు. అయితే ఉన్నట్టుండి మరోమారు ఇది వైరల్ అవుతుండటం విశేషం. హిందూ సంస్కృతిని భ్రష్టుపట్టించే చర్యలుగా సోషల్ మీడియా యూజర్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు దీనిపై ఆమె నిజాయితీగా క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నెటిజన్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

ఫిబ్రవరి 18, 2015లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆకృత్యాన్ని ఆమె ట్వీట్ చేయటం పెద్ద వివాదానికి దారితీసింది. ఆతరువాత తీరిగ్గా తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని.. ఇది ఆకతాయిలు చేసిన అతి చెడ్డ చర్యగా పేర్కొని ఈ వివాదం నుంచి స్మార్ట్ గా బయటపడ్డారు.



హ్యాకింగ్ థియరీ కూడా..
అంతేకాదు హ్యాకింగ్ కారణంగా తన పాత పోస్టులు కూడా చాలావరకు డిలీట్ అయ్యాయని పెద్ద వివరణే ఇచ్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన హ్యాకింగ్ థియరీ అంతా కట్టుకథగా సాక్షాధారాలతో సహా తేల్చారు నెటిజన్లు. 2017 వరకు తన అకౌంట్ ను ఆమె నడుపుకోలేక పోతున్నట్టు చెప్పినప్పటికీ.. ఆమధ్య కాలంలో తాను నటించిన సినిమాల ప్రమోషన్ ఫొటోలు, వీడియోలు హ్యాకర్ ఎందుకు పోస్ట్ చేస్తారంటూ ఆమెను నిలదీశారు కూడా. సాయోని తన సొంత వ్యానిటీ వ్యాన్ లో తీసుకున్న ఫొటోలు, వ్యక్తిగత ఫొటోలు కూడా 2015-2017 వరకు తరచూ ట్వట్టర్లో పోస్ట్ చేసినా, తన అకౌంట్ తన అధీనంలో లేదని చెప్పుకొచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్విట్టరటీలు ఆమెను ట్వీట్లతోనే రోస్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా ఆమె దీనిపై నోరుమెదపలేదు.





కంప్లైంట్ల వెల్లువ..
ఈ మీమ్ పాతదైనప్పటికీ ఇది హిందువుల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా అత్యంత జుగుప్సాకరంగా ఉందంటూ బీజేపీ నేత, మేఘాలయా మాజీ గవర్నర్ తథాగథా రాయ్ (Tathagata Roy) ఈమెపై పోలీసు కంప్లైంట్ నమోదు చేశారు. “.. మీరు తప్పు చేశారు కనుక ఐపీసీ సెక్షన్ 295ఏ కింద శిక్షకు సిద్ధంగా ఉండాలం"టూ రాయ్ ట్వీట్ చేశారు. అసోంలో కూడా ఇలాంటి కేసు నమోదు అవ్వనుందని ఆయన తెలిపారు. మొట్టమొదట బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నటి పోస్ట్ చేసిన మీమ్ పై ఫిర్యాదు చేయగా.. మరికొంతమంది ఇప్పుడు కంప్లైంట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వివాదాల్లో సెలబ్స్..
అసలే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సాఫ్ట్ టార్గెట్లుగా మారుతుండగా మైక్రో బ్లాగింగ్ సైట్లలో (micro blogging sites) మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సెలబ్స్ అదే పనిగా వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి తమ ఇమేజ్ ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వివాదాల్లో నలిగితేనే మరింత ఇమేజ్ పెరిగి, చాన్సులు దక్కుతాయనే ఫిలాసఫీని గట్టిగా నమ్మే మెజార్టీ సెలబ్రిటీలు వివాదాలనే కేరాఫ్ గా చేసుకుంటున్నారు.
Published by:Srinivas Munigala
First published:January 18, 2021, 16:09 IST