Home /News /trending /

BENGALI ACTOR TRIED TO END HIS LIFE ADMITTED TO HOSPITAL POLICE PAH

‘భార్య, అత్త వేధింపులు...’ సెల్ఫీ వీడియో తీసి ప్రముఖ నటుడు ఆత్మహత్యాయత్నం..

 నటుడు సైబల్ భట్టాచార్య (ఫైల్)

నటుడు సైబల్ భట్టాచార్య (ఫైల్)

Actor Saibal Bhattacharya: ప్రముఖ నటుడు కొన్నిరోజులుగా భార్య, అత్త వేధింపులను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరివేసుకుని సైబల్ భట్టాచార్య సూసైడ్ కు యత్నించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India
వెస్ట్ బెంగాల్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. బెంగాలీ నటుడు సైబల్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్‌లోని కస్బాలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మద్యం తాగి ఉన్న సైబల్ భట్టాచార్య.. ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత.. ఆయన తన కొన్నిరోజులుగా తన భార్య, అత్త వేధింపులను భరించలేక పోతున్నానని అన్నాడు. అంతే కాకుండా.. ఇవన్ని భరించలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే.. ఆయన ఉరివేసుకుంటుండగా ఇంట్లో వారు గమనించారు. వెంటనే ఆయనను చిత్తరంజన్ ఆస్పత్రికి తరలించారు.

సైబల్ భట్టాచార్యను వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల బెంగాలీ నటీనటులు పల్లవి డే, బిదిషా డి మజుందార్, మోడల్-నటి మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకుని మరణించారు. కాగా, తాజాగా, కొన్ని నెలల తర్వాత Mr భట్టాచార్య ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వార్తలు సినిమా వర్గాలలో తీవ్ర దుమారంగా మారింది.



ఇదిలా ఉండగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.. !

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాతో పాటు శర్వానంద్ ఇటీవలే కనిపించాడు. అయితే ఈ సినిమా శర్వానంద్‌కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా  ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.

ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు మేకర్స్‌.సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, అమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు చిత్ర యూనిట్. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ గ్లింప్స్ శర్వానంద్‌ని నిరాశలో ఉన్న ఓ సంగీతకారుడిగా చూపించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Movie News, Tollywood, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు