Gold Mask: దుర్గామాతకు గోల్డ్ మాస్క్.. అలా కరోనాకి చెక్!

దుర్గామాతకు గోల్డ్ మాస్క్ (image credit - twitter)

Gold Mask: ఇదివరకు దేవుళ్లకు నగలు, కిరీటాలను కానుకలుగా ఇచ్చేవారు. ఇప్పుడు మాస్కులు కూడా అలంకరణలో భాగమైపోయాయి. ఇంతకీ దూర్గామాతకు గోల్డ్ మాస్క్ వేస్తే.. కరోనా ఎలా పోతుంది?

 • Share this:
  Gold Mask: అది అన్ని మాస్కుల లాంటిది కాదు... బంగారంతో చేసిన మాస్క్. బరువు 20 గ్రాములు. కోల్‌కతా... బగుయాటీ ఏరియాలోని పూజా మండపంలో అమ్మవారి విగ్రహానికి ఈ మాస్కును తొడిగారు. అంతేకాదు... ఇక్కడ అమ్మవారి చేతుల్లో ఆయుధాలకు బదులు సానిటైజర్, ఆక్సీమీటర్, ధెర్మోగన్, సిరంజి వంటి వైద్య పరికరాలు ఉంచారు. కంప్లీంట్‌గా కరోనాను తరిమేయడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐతే... అమ్మవారి విగ్రహం, ఏర్పాట్లు ఇంకా పూర్తికాలేదు. కాకపోతే... ఈసారి దసరాకి తమ థీమ్ ఇదే అని చెప్పడం కోసం ఆదివారం ఈ విగ్రహాన్ని ప్రజలకు చూపించారు.

  ఇలా అమ్మవారికి మాస్క్ తొడిగితే... కరోనా పోతుందా అని ప్రజలు అడిగితే... నిర్వాహకులు ఓ కారణం చెప్పారు. జనరల్‌గా ప్రజలు ఇతరులు ఏం చేస్తే అది చేస్తుంటారు. ఇక్కడ స్వయంగా అమ్మవారే మాస్క్ ధరించడం వల్ల... ఆమెను పూజించేందుకు, దర్శించేందుకు వచ్చేవారు కూడా మాస్క్ ధరిస్తారనీ... అలా కరోనాను తరిమేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. పైగా ఈ విగ్రహం ద్వారా... కరోనా రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఓ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని వారు అంటున్నారు.

  durga devi gold mask, gold mask, goddes gold mask, gold mask in kolkata, dussehra 2021, kalika mata, bengal news updates, Bengal News, goddess durga, news today, కరోనా కేసులు, బెంగాల్ కరోనా,
  దుర్గామాతకు గోల్డ్ మాస్క్ (image credit - twitter)


  "దయచేసి అది కాస్ట్‌లీ బంగారు మాస్క్ అని అనుకోవద్దు. దాన్ని హైఎండ్ యాక్సెసరీగా చూడొద్దు" అని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బెంగాల్ సింగర్ అదితీ మున్షీ అన్నారు. విగ్రహాన్ని బంధు మహల్ క్లబ్‌లో ఆమె ఆవిష్కరించారు.

  "అసలు ఆలోచన ఏంటంటే... బెంగాల్‌లో ప్రతి కూతురూ బంగారు తల్లే. ప్రత తల్లిదండ్రులూ తమ అమ్మాయిలకు బంగారం కొనాలనుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఏదో అలంకారంలా ఈ మాస్క్ పెట్టలేదు. ఇలా అమ్మవారిని చూసినప్పుడు భక్తుల్లో మాస్క్ పెట్టుకోవాలనే ఆలోచన కలుగుతుంది. అలాగే... చేతిలో కరోనా వైద్య పరికరాలు కూడా. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించడం అత్యవసరం" అని ఆమె తెలిపారు.

  ఇది కూడా చదవండి: Dhana Yoga: ధనయోగం అంటే?.. అది పట్టాలంటే ఏం చెయ్యాలి?

  ఈ సంవత్సరం పూజా మండపాల్లో అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రజలు వెళ్లవద్దని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కానీ ప్రజలు మాత్రం వెళ్లి పూజలు చెయ్యాలనుకుంటున్నారు. అలా చేస్తే... మళ్లీ కరోనా పెరుగుతుందేమో అనే టెన్షన్ ఉంది. అసలే బెంగాల్‌లో అత్యంత వైభవంగా జరిపేది కాళికామాత వేడుకలే. ఈ క్రమంలో థర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: