BENGAL MAN CELEBRATES THE DEATH ANNIVERSARY OF A PET MORE THAN 100 STRAY DOGS WERE INVITED SK
Dog Death Anniversary: కుక్కకు వర్ధంతి.. వందకు పైగా వీధి కుక్కలకు భోజనాలు.. నిజమైన జంతు ప్రేమికుడు..
కుక్క వర్దంతి కార్యక్రమం
Dog Death Anniversary: ఓ జంతు ప్రేమికుడు తన పెంపుడు కుక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుక్క ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తమ ప్రాంతంలోని వీధి కుక్కలకు మాంసాహార భోజనం పెట్టారు.
మనలో చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటారు. కుక్క, పిల్లి, కుందేలు, కోళ్లు, చిలుకలను ఇంట్లో పెంచుతుంటారు. కొందరు సరదా కోసం పెంచుతూ.. మరికొందరు వాటిపై ఉన్న ఇష్టంతో సాదుతుంటారు. ఐతే ఇంకొందరు మాత్రం వాటిని సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. కన్నబిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఏటా పుట్టిన రోజు వేడుకలు కూడా చేస్తారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. సొంత మనిషిని పోగొట్టుకున్నట్లుగా ఫీలవుతారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని హుగ్లీలో కూడా ఇలాంటి జంతు ప్రేమికుడే ఉన్నారు. తన పెంపుడు కుక్క మరణించిన తర్వాత.. వర్ధంతి కార్యక్రమాన్ని (Dog Death Anniversary) నిర్వహించాడు. ఈ సందర్భంగా దాదాపు 100 కుక్కలను పిలిచి వాటికి భోజనం పెట్టాడు.
హుగ్లీలోని చందన్ నగర్‌కు చెందిన తరుణ్ ఘోష్ దస్తీదార్కు జంతువులంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నాడు. వాటికి పేర్లు పెట్టి.. సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నాడు. ఐతే గత ఏడాది మే 15న బిచ్చు అనే కుక్క అనారోగ్యంతో మరణించింది. తమకు ఎంతో ఇష్టమైన బిచ్చు మరణించడంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బిచ్చు మరణించి ఏడాది పూర్తవడంతో.. మొదటి వర్ధంతిని నిర్వహించారు. మనిషికి వర్ధంతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో.. అచ్చం అలాగే బిచ్చు వర్ధంతిని కూడా నిర్వహించారు. ఆదివారం ఘోష్ దస్దీదార్ తమ ఇంట్లో కుక్క చిత్రపటానికి పూలమాల వేశారు. ఒక్కటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యల దండలతో దాని చిత్రపటాలను అలంకలరించారు. అనంతరం కాసేపు మౌనం పాటించి.. దానిని స్మరించుకున్నారు.
బిచ్చు వర్ధంతి కార్యక్రమానికి బంధువులు, చుట్టుపక్కల వారిని కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత తమ ప్రాంతంలో ఉండే 100కు పైగా కుక్కలకు భోజనం పెట్టారు. పెద్ద గిన్నెలో చికెన్ వంటకాలను తోపుడు బండిపై తీసుకెళ్లి.. కనిపించిన కుక్కకల్లా పెట్టారు. రోడ్డుపై ఉండే యాచకులు, వీధి వ్యాపారులకు కూడా భోజనం వడ్డించారు. వాస్తవానికి తరుణ్ ఘోష్ శాఖాహారి. మాంసం తినరు. కానీ వచ్చిన గెస్ట్‌లు, కుక్కలకు మాత్రం రుచికరమైన మాంసాహార భోజనం వడ్డించారు. ఇలా అందరి మధ్య తమకు ఎంతో ఇష్టమైన బిచ్చు వర్ధంతిని జరుపుకున్నారు. తరుణ్ ఘోష్ దస్తిదార్ కుటుంబం నిర్వహింిన ఇలాంటి వినూత్న కార్యక్రమానికి ఆ ప్రాంతంలోని మేధావుల నుంచి జంతు ప్రేమికుల వరకు అందరి నుంచి ప్రశసంలు అందుతున్నాయి. మీరు నిజమైన జంతు ప్రేమికుడు అని కొనియాడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.