హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Covid Wedding : గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం..జొమాటోలో విందు

Covid Wedding : గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం..జొమాటోలో విందు

ఆన్ లైన్ లో పెళ్లికి ఆహ్వానం

ఆన్ లైన్ లో పెళ్లికి ఆహ్వానం

Online Marriage : కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్‌ మొదలైంది. ఆన్‌లైన్ పెళ్లిళ్లకు నేటి తరం యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఓ జంట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. ఎవరిని నొప్పించకుండా వినూత్నంగా వివాహం చేసుకోబోతుంది. గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం ఇచ్చి.. జొమాటో ద్వారా విందు ఏర్పాటు చేసింది. గతేడాది కొంత మంది వధూవరులు జూమ్‌ కాల్‌లోనే పెళ్లిపీటలెక్కడం లేదా.. తమ పెళ్లిని ఆన్‌లైన్‌ లైవ్‌లో ప్రసారం చేయడం వంటివి చేశాం.

ఇంకా చదవండి ...

Google Meet Wedding :  భారతీయ సంప్రదాయంలో పెళ్లి అనేది అతిపెద్ద వేడుక. ఆకాశమంత పందిళ్లు.. చుట్టాల సందళ్లు.. విందు భోజనాలు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలో కూడా పెళ్లి ఇంత పెద్ద ఎత్తున జరగదు, ఇంత మంది అతిథులు హాజరు కారు. అయితే ఇదంతా రెండేళ్ల క్రితం వరకు ఉన్న మాట. కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్‌ మొదలైంది.

నేటి కరోనా కాలంలో ఆర్భాటాలు లేకుండా ఆన్‌లైన్ పెళ్లిళ్లకు నేటి తరం యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. సంప్రదాయానికి టెక్నాలజీని జోడించి.. సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. కోవిడ్ పుణ్యమా అని ఈ పద్ధతికి మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా ఓ జంట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. ఎవరిని నొప్పించకుండా వినూత్నంగా వివాహం చేసుకోబోతుంది. గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం ఇచ్చి.. జొమాటో ద్వారా విందు ఏర్పాటు చేసింది.

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్‌ ప్రాంతానికి చెందిన సందీపన్‌ సర్కార్‌, అదితి దాస్‌.. ఏడాది క్రితమే పెళ్లి నిశ్చయమైంది. అయితే కరోనా ఆంక్షల కారణంగా పలుమార్లు వీరిద్దరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ నెల 24న పెళ్లి పీటలెక్కాలని నూతన వధూవరులు నిర్ణయించుకున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుడు సందీపన్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు. అంతలోనే రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా శుభకార్యాలకు అతిథులపై పరిమితి విధించింది బెంగాల్ ప్రభుత్వం. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో బంధువులందర్నీ పిలిచి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని. అలా అని మళ్లీ వివాహ తేదీని వాయిదా వేయలేని పరిస్థితి.

ALSO READ పెళ్లికి ముందే ఆ ముచ్చట తీర్చుకున్న నూతన వధువు..ఆశ్చర్యపోయిన బంధు,మిత్రులు

దీంతో వివాహాన్ని వాయిదా వేయకుండా కోవిడ్ నిబంధనలను ఫాలో అవుతూనే తమ వివాహాన్ని చేసుకోవాలని సందీపన్‌ సర్కార్‌, అదితి దాస్‌ నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు ఓ అద్భుతమైన ఆలోచన చేశారు. గూగుల్ మీట్ ద్వారా తమ పెళ్లి వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట. పెళ్లికి 450 మంది అతిథులను ఆహ్వానించారు. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు వారందరికీ గూగుల్ మీట్‌లో ఓ లైవ్ లింక్, పాస్ వర్డ్‌ను పంపించనున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి బంధువులు తమ ఇళ్ల నుంచే పెళ్లిని తిలకించి, యువ జంటను ఆశీర్వదించవచ్చు.

ఇక,పెళ్లి భోజనానికి కూడా ఏర్పాట్లు చేశారు. అతిథులందరికీ జొమాటోలో భోజనం ఆర్టర్ చేసి వారి ఇళ్లకు డెలివరి పంపించనున్నారట. వీరి పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా,గత రెండేళ్లలో ఇలాంటి ఆన్ లైన్ పెళ్లిళ్లు పెరిగిపోయాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో గతేడాది ఆన్ లైన్ లోనే వరుడు..వధువు మెడలో తాలిబొట్టు కట్టిన ఘటనలు కూడా చూశాం. కొంత మంది వధూవరులు జూమ్‌ కాల్‌లోనే పెళ్లిపీటలెక్కడం, తమ పెళ్లిని ఆన్‌లైన్‌ లైవ్‌లో ప్రసారం చేయడం వంటివి చూశాం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona wedding card, Newly Couple, Online marriage

ఉత్తమ కథలు