HOME »NEWS »TRENDING »bengal cm mamata benerjee shakes her leg on music festival video goes viral ms

Mamata Benerjee Dance: స్టెప్పేసిన దీదీ... వైరల్ అవుతున్న వీడియో..

Mamata Benerjee Dance: స్టెప్పేసిన దీదీ... వైరల్ అవుతున్న వీడియో..
మమతా బెనర్జీ (ఫైల్)

ఇటు పాలన. ముంచుకొస్తున్న ఎన్నికలు.. పార్టీని వీడుతున్న నాయకులు. ప్రత్యర్థుల విమర్శలు.. ఇన్ని షెడ్యూళ్ల మధ్య కూడా ఆమె కాలు కదిపింది. తనలోని నృత్యకారిణిని ప్రజలకు పరిచయం చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

  • News18
  • Last Updated: December 25, 2020, 18:20 IST
  • Share this:
    ఆమె దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రెండు పర్యాయాలుగా రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నేత. ఆమె మాటలు తూటాల్లా దూసుకెళ్తాయి. రాజకీయ ప్రసంగాలకు ఆమె ఫ్యాన్స్ ఊగిపోతారు. కొద్దిరోజులుగా బెంగాల్ అంటే తానేనని తన ప్రత్యర్థులతో పోరాడుతున్నారు. ఇటు పాలన. ముంచుకొస్తున్న ఎన్నికలు.. పార్టీని వీడుతున్న నాయకులు. ప్రత్యర్థుల విమర్శలు.. ఇన్ని షెడ్యూళ్ల మధ్య కూడా ఆమె కాలు కదిపింది. తనలోని నృత్యకారిణిని ప్రజలకు పరిచయం చేసింది. ఆమే దీదీ. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

    టీఎంసీ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాలు కదిపారు. 2020 బెంగాల్‌ సంగీత మేలా సందర్భంగా.. తనదైన శైలిలో స్టేజ్‌పై స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బం‍గ్లా మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన ఆమె.. అక్కడికి వచ్చిన పలువురు నాట్యాకారులతో కలిసి ఆటవిడుపుగా స్టేజ్‌పై స్టెప్పులేశారు.







    ప్రముఖ సంతాల్ నృత్యకారిణి బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌ను సన్మానించిన మమతా బెనర్జీ... తనకు కూడా నేర్పించాలని అడిగారు. ఇదే క్రమంలో బసంతితో కలిసి దీదీ కూడా డాన్స్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దీదీ.. బీజేపీపై నిప్పులు చెరిగారు.
    Published by:Srinivas Munigala
    First published:December 25, 2020, 18:20 IST

    टॉप स्टोरीज