BEGGAR WHO BOUGHT A BIKE WITH THE MONEY HE BEGGED FOR HIS WIFE IN MADHYA PRADESH SNR
Video Viral:భార్య కోసం లక్ష ఖర్చు చేసిన బిచ్చగాడు..అంత డబ్బుతో ఏం కొన్నాడో ఈ వీడియో చూడండి
(Photo Credit:Youtube)
Viral News:ఆలయాల దగ్గర చిల్లర డబ్బులు అడుక్కునే వాడు సుమారు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనుగోలు చేశాడు. రోజూ అడుక్కున్న డబ్బులను దాచుకొని బైక్ కొనుక్కొని దానిపై వెళుతూ అడుక్కోవడంతో వార్తలకెక్కాడు. ఇదంతా బిచ్చగాడు ఎందుకోసం చేశాడో తెలుసా.
లక్షాధికారి బిక్షగాడిగా మారొచ్చు. బిచ్చగాడు లక్షాధికారి అవ్వొచ్చు. ఇందుకు సరైన ఉదాహరణగా చెప్పుకునే సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో వెలుగులోకి వచ్చింది. చింద్వారా(Chindwara)లో సంతోష్‌కుమార్ సాహు (Santoshkumar Sahu)అనే బిచ్చగాడి కథ ఇది. కాళ్లు లేకపోవడంతో గుడి దగ్గర బిక్షాటన( Begging)చేసుకుంటూ బ్రతుకుతున్నాడు సంతోష్‌కుమార్. ఆలయాలు, మసీదులు, చర్చీల ముందు కూర్చొని డబ్బులు అడుక్కునేవాడు. వికలాంగుడు( Disabled)కావడంతో అతడ్ని గుళ్లు, చర్చీల చుట్టూ తిరగడానికి ఓ ట్రై సైకిల్(Tricycle)ఉండేది. సంతోష్ కుమార్‌ని అందులో కూర్చొబెట్టుకొని అతని భార్య తీసుకెళ్తూ ఉండేది. చాలా రోజులుగా ఇదే పని చేస్తుండటంతో సంతోష్ సాహు భార్య అనారోగ్యానికి గురైంది.
భార్యపై బిచ్చగాడి ప్రేమ..
భిక్షాటన చేసుకుంటున్న దంపతులిద్దరూ తమకొచ్చిన బాధను పంచుకున్నారు. సమస్యల్ని అర్ధం చేసుకున్నారు. అందుకోసమే భార్యకు తన బండి లాగే సమస్య నుంచి విముక్తి కలిగించాలని పట్టుబట్టాడు. రోజూ అడుక్కోవడం వల్ల 300రూపాయల నుంచి 400వరకు వచ్చేవి. వాటిని దాచిపెట్టాడు. అలా మొత్తం దాచిపెట్టిన 90వేల రూపాయల డబ్బుతో టీవీఎస్ ఎక్సెల్ బైక్‌ని కొనుగోలు చేశాడు. దానిపై భార్యను కూర్చొబెట్టుకొని సంతోష్‌కుమార్ సాహు ఇప్పుడు ఆలయాల చుట్టూ తిరుగుతూ బిక్షాటన చేస్తున్నాడు. తింటానికి అడుక్కునే ఓ భిక్షగాడు..కేవలం భార్య అనారోగ్యానికి గురైందని తెలిసి అడుక్కున్న డబ్బులను ఆదా చేసి బైక్ కొనుగోలు చేసిన విషయం వైరల్ అవుతోంది.
#WATCH A beggar, Santosh Kumar Sahu buys a moped motorcycle worth Rs 90,000 for his wife Munni in Chhindwara, MP
Earlier, we had a tricycle. After my wife complained of backache, I got this vehicle for Rs 90,000. We can now go to Seoni, Itarsi, Bhopal, Indore, he says. pic.twitter.com/a72vKheSAB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 24, 2022
డబ్బుల్లేని శ్రీమంతుడు..
కట్టుకున్న భార్య ఇంత వరకు తనను మోస్తూ ట్రైసైకిల్ తొక్కిందని..ఇప్పుడు ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో ఎలాగైనా ఆమెకు విశ్రాంతి కలగచేయాలని..ఈసమస్య నుంచి విముక్తి కలిగించాలనే గత కొద్ది సంవత్సరాల క్రితమే అనుకున్నానని చెప్పాడు. అన్నీ అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్లు, డబ్బున్న వాళ్లే కట్నం, కానుకల కోసం కట్టుకున్న భార్యను వేధిస్తున్నారు. అలాంటిది ఓ వికలాంగుడు తన భార్య ఆరోగ్యం పాడైపోతే ఆమెను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇప్పుడు అతని వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.