డైనోసార్ల రక్తం తాగిన నల్లులు..? కొత్త పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

ఇప్పటి వరకు నల్లులు 5 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితమే పుట్టాయని నమ్ముతూ వచ్చాం. కానీ, 10 కోట్ల ఏళ్ల క్రితమే అవి పుట్టాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు.

news18-telugu
Updated: May 17, 2019, 1:59 PM IST
డైనోసార్ల రక్తం తాగిన నల్లులు..? కొత్త పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
నల్లి (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: May 17, 2019, 1:59 PM IST
నల్లులు(బెడ్ బగ్స్).. మన రక్తాన్ని పీల్చే పురుగు. పరుపులలో, అరల లోపల, గోడల సందులో, ఇంటి మూలల్లో ఉంటూ.. రాత్రి పూట నరకం చూపించే కీటకాలు ఇవి. ఒక్కసారి మన చర్మానికి పట్టిందా.. పీల్చి పిప్పి చేసే వరకు వదలదు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వీటి బెడద ఉంటోంది. ఇవి ఇప్పుడిప్పుడే భూమ్మీదకు రాలేదట. ట్రిసియల్ కాలంలో భూమిని శాసించిన డైనోసార్ల కాలంలోనే ఇవి పుట్టాయట. ఇప్పటి వరకు నల్లులు 5 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితమే పుట్టాయని నమ్ముతూ వచ్చాం. కానీ, 10 కోట్ల ఏళ్ల క్రితమే అవి పుట్టాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వీటి అవశేషాలను సేకరించి 15 ఏళ్ల పాటు పరీక్షలు చేయగా డైనోసార్ల కాలంలోనే వీటి మనుగడ ప్రారంభమైనట్లు తేలిందట. డాక్టర్ స్టీఫెన్ రోథ్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘తొలి క్షీరదంగా భావిస్తున్న గబ్బిలం కంటే ముందే భూమ్మీదకు నల్లులు వచ్చాయని తమ పరిశోధనల్లో తేలడంతో షాక్ తిన్నాం. అవి ఇప్పటికీ భూమ్మీద బతుకుతున్నాయంటే ఆశ్చర్యమే’ అని తెలిపారు. నల్లులు డైనోసార్ల రక్తం కూడా పీల్చి ఉండవచ్చని వెల్లడించారు.

నల్లుల గురించి ఆసక్తికర విషయాలు:
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...