• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BEAUTY PAGEANT FOR SHEEP TURKEY ORGANIZED A CATWALK FOR LAMB TO PROMOTE LIVESTOCK BREEDING GH SRD

Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో క్యాట్ వాక్ చేసిన గొర్రెలు.. సూపర్ అంటోన్న నెటిజన్లు..

Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో క్యాట్ వాక్ చేసిన గొర్రెలు.. సూపర్ అంటోన్న నెటిజన్లు..

Photo Credit : Rueters Twitter

Beauty Pageant for Sheep : భ‌యంగా, కంగారుగా తిరుగుతున్న ఈ గొర్రెపిల్ల‌ల్లో ముచ్చ‌టేసే అమాయ‌క‌త్వం కన్పిస్తోంది. అందమనేది మనుషులకే కాదు..జంతువులకు కూడా సంబంధించినదని ఈ పోటీలు నిరూపించాయ్.

  • Share this:
అందాల పోటీలు మ‌నుషుల‌కే కాదు, జంతువుల‌కూ నిర్వ‌హిస్తారు. ఇంతకుముందు మనం కుక్కలకు ఇలాంటి పోటీలు చూశాం. దీంతో పాటు కోడి పందాలు, ఎద్దుల ప‌రుగులు, గొర్రెల కుమ్ములాట‌ల వంటి బ‌ల నిరూప‌ణ పోటీలు కూడా చూశాం. కానీ కొన్ని దేశాల్లో వీటితో పాటు వాటి వివిధ జంతువుల సౌమ్య‌త్వాన్ని, అందాన్ని చూపే అందాల పోటీలూ నిర్వ‌హిస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ పోటీ టర్కీలో జరిగింది. అక్కడ జరిగిన గొర్రెపిల్ల‌ల అందాల పోటీ వీడియో ఇంట‌ర్నెట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో అంత స్పెష‌లేంటో చూద్దాం రండి. ట‌ర్కీలో గొర్రెపిల్ల‌ల‌తో నిర్వ‌హించిన ఈ అందాల పోటీల‌కూ ఒక కార‌ణం ఉంది. ఆగ్నేయ ట‌ర్కీ ప్రావిన్స్‌లోని దియార్‌బ‌కీర్ అనే చోట జ‌రిగిన ఈ అందాల పోటీల్లో దాదాపుగా రెండు డ‌జ‌న్ల గొర్రెలు పాల్గొన్నాయి. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగే అందాల పోటీల్లా కాకుండా దీనికంటూ ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అందుకే నెటిజ‌న్లు, సామాజిక మాధ్య‌మాల్లో అంత‌‌గా ఆద‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో జంతువులకు నిర్వహించిన అందాల పోటీల కంటే ఈ గొర్రెపిల్ల‌ల అందాల పోటీ కాస్త ప్ర‌త్య‌ేకంగానే ఉంది. ప‌శువుల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో నిర్వ‌హించిన ఈ పోటీల‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో ర‌క‌ర‌కాల గొర్రెలు, గొర్రె పిల్ల‌లు ర్యాంప్‌పైన న‌డుస్తుంటే ప్రేక్ష‌కులు సంబ‌రంగా చూస్తుండిపోయారు.

అంత‌ర్జాతీయ మీడియాను ఆక‌ర్షించిన ఈ గొర్రెపిల్లల అందాల పోటీ వీడియోలో కొన్ని గొర్రెలు , గొర్రెపిల్లలతో ర్యాంప్ పై క్యాట్‌వాక్ చేయించారు. భ‌యంగా, కంగారుగా తిరుగుతున్న ఈ గొర్రెపిల్ల‌ల్లో ముచ్చ‌టేసే అమాయ‌క‌త్వం కూడా క‌నిపిస్తుంటుంది. ఈ అందాల పోటీ కోసం వాటిని అంద‌మైన బ‌ట్ట‌లు, ఆభ‌ర‌ణాల‌తో అలంక‌రించారు. అయితే ఈ వీడియోలో ర్యాంప్‌ పై గొర్రెల‌ను న‌డిపించ‌డానికి వాటి య‌జ‌మానులు ప‌డే అవ‌స్థ కూడా క‌నిపిస్తుంది.


చివ‌రిగా, త‌మ త‌మ అందాల గొర్రెల‌తో యజమానులు దిగిన గ్రూప్ ఫొటోతో కార్యక్రమం అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. అయితే, ముందుగా చెప్పిన‌ట్లు ప‌శువుల పెంప‌కాన్ని ప్రోత్స‌హించ‌డానికి నిర్వ‌హించిన ఈ పోటీకు మంచి స్పంద‌నే రావ‌డం నిర్వాహ‌కులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇలా ప‌శువుల పెంప‌కాన్ని ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధితో పాటు వ్యాపార‌ప‌రంగా మంచి లాభాల‌ను కూడా సాధించ‌వ‌చ్చ‌ని, అలాగే స్వ‌యం ఉపాధి పెరిగి నిరుద్యోగం స‌మ‌స్య కాస్తైనా త‌గ్గుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు