ఉద్దానంలో ఎలుగుబంట్ల బీభత్సం.. గజ గజ వణుకుతున్న ప్రజలు..

Andhra Pradesh News: ఉద్దానం ప్రాంతం నుంచి అటు సముద్రం వైపు ఇటు పల్లపు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ ఊళ్లలోకి వస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఒంకులూరుగెడ్డ సమీపంలో కాశీబుగ్గకు చెందిన ఒక బట్టల వ్యాపారి కాలకృత్యాల కోసం రోడ్డు పక్కన కూర్చోగా ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 4:14 PM IST
ఉద్దానంలో ఎలుగుబంట్ల బీభత్సం.. గజ గజ వణుకుతున్న ప్రజలు..
ఎలుగుబంటి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
శ్రీకాకులం జిల్లా పలాస నియోజకవర్గంలోని ఉద్దానంలో ఎలుగు బంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని జీడి తోటల్లో స్వైర విహారం చేస్తూ పంటల్ని నాశనం చేస్తున్నాయి. రాత్రిపూట వీధుల్లోకి వచ్చి వణికిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు ఈ ప్రాంతంలో జీడి తోటలు దట్టంగా ఉండేవి. పొద్దుపోయాక ఎలుగు బంట్లు తమ దాహార్తిని తీర్చుకోవడానికి వాటికంటూ ప్రత్యేకంగా దారులు చేసుకొని వచ్చేవి. అయితే, ఆ దారులన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటికి తోడు గత ఏడాది అక్టోబరులో వచ్చిన తిత్లీ తుఫానుకు జీడి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్దానం ప్రాంతం నుంచి అటు సముద్రం వైపు ఇటు పల్లపు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ ఊళ్లలోకి వస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఒంకులూరుగెడ్డ సమీపంలో కాశీబుగ్గకు చెందిన ఒక బట్టల వ్యాపారి కాలకృత్యాల కోసం రోడ్డు పక్కన కూర్చోగా ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది.

గత రెండు రోజులుగా ఉద్దాన ప్రాంతంలో డెప్పూరు, అనకపల్లి, సీతానగర్, వంకులూరు, చీపురుపల్లి తదితర గ్రామాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే గత మూడేళ్లలో పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించాలని వారు కోరుతున్నారు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు