జాగ్రత్త... థర్మాకోల్ కప్పుల్లో టీ తాగుతున్నారా... ప్రాణాలకే ప్రమాదం...

Tea : గాజు గ్లాసుల్లో టీలు తాగే రోజులు పోయాయి. టీ కార్నర్లకు వెళ్లగానే... థెర్మోకోల్ కప్పుల్లో టీ ఇచ్చేస్తున్నారు. మనం కూడా వాటిని తాగేస్తున్నాం. కానీ ఆ కప్పుల్లో టీ తాగొద్దంటున్నారు డాక్టర్లు. ఎందుకో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 13, 2019, 9:27 AM IST
జాగ్రత్త... థర్మాకోల్ కప్పుల్లో టీ తాగుతున్నారా... ప్రాణాలకే ప్రమాదం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీ అంటే మనందరికీ ఇష్టమే. కాస్త పని ఒత్తిడి ఉంటే చాలు... అలా వెళ్లి ఓ టీ తాగి వస్తుంటాం. ప్రపంచంలో ఎక్కువగా టీ తాగుతున్నది ఇండియన్లే. అందుకే కదా... టీ మన జాతీయ పానీయంగా గుర్తింపు పొందింది. ఆ విషయం అలా ఉంచితే... ఈ రోజుల్లో చాలా హోటళ్లు, టీ కార్నర్లలో టీ అడిగితే చాలు... థర్మాకోల్ కప్పుల్లో టీ ఇచ్చేస్తున్నారు. అవైతే... తాగిన తర్వాత ఖాళీ కప్పును డస్ట్‌బిన్‌లో పడెయ్యవచ్చు. అదే గాజు గ్లాసులో, పింగాణీ కప్పులో అయితే... టీ తాగిన తర్వాత... వాటిని కడగాలి... అందుకు వాటర్ కావాలి. ఇవన్నీ ఎందుకొచ్చిన సమస్యలు అనుకుంటున్న హోటళ్లు, టీ షాపుల ఓనర్లు... థర్మాకోల్ కప్పుల్లో టీ ఇచ్చేస్తున్నారు. మనం ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాం... టీ ఆర్డరిచ్చామా... తాగామా... డబ్బులిచ్చి వెళ్లిపోయామా... అంతవరకే పట్టించుకుంటాం. కానీ... ఆ కప్పుల్లో టీ తాగితే లేనిపోని రోగాలు రావడం ఖాయమంటున్నారు డాక్టర్లు.

నిజానికి ఆ కప్పులు థెర్మోకోల్‌తో తయారుచేస్తున్నవి కావు. పాలియస్టర్స్‌తో చేస్తున్నవి. అదో రకమైన ప్లాస్టిక్. అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనది. వేడి వేడి టీని... పాలియస్టర్ కప్పుల్లో పోసినప్పుడు... ఆ కప్పుల్లో మూలకాలు కొన్ని టీలో కలుస్తాయి. అవి తిన్నగా మన పొట్టలోకి వెళ్లిపోతున్నాయి. అవి రకరకాల రోగాలకు కారణం అవ్వడమే కాదు... చివరకు ప్రాణాంతకమైన కాన్సర్ కూడా వచ్చేందుకు కారణం అవుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. తరచుగా అలసట, దృష్టి లోపాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

రోజూ థర్మోకోల్ కప్పుల్లో టీ తాగితే, చర్మ రోగాలు కూడా వస్తున్నాయని తెలిసింది. చర్మంపై ఎర్రటి మచ్చలు, నొప్పి, గొంతులో గరగర వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రోజూ థర్మోకోల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగితే... పొట్టలో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆ కప్పులను అంటిపెట్టుకొని ఉండే బ్యాక్టీరియా కూడా పొట్టలో చేరి... రకరకాల రోగాలు తెస్తోంది.

ఈ కప్పుల్లో టీ లీకవ్వకుండా... ఆర్టిఫిషియల్ వాక్స్ (కృత్రిమ మైనం) పూస్తున్నారు. మనం టీ తాగినప్పుడు వాక్స్ కూడా పొట్టలోకి వెళ్లిపోతుంది. దాని వల్ల చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. జీర్ణప్రక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. సో... ఇకపై మనం ఆ కప్పుల్లో టీ ఇవ్వవద్దని చెప్పడం బెటర్. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు