పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ షోకాజ్ నోటీసులు... ‘కాఫీ విత్ కరణ్’ తెచ్చిన తంటా...

BCCI Send show-cause Notices to Hardhik Pandya and KL Rahul: ‘కాఫీ విత్ కరణ్’లో రచ్చ రచ్చ చేసిన యంగ్ క్రికెటర్లు... మహిళలను కించపరుస్తూ మాట్లాడిన హార్ధిక్ పాండ్యా... ట్రోలింగ్ పెరగడంతో ట్విట్టర్లో క్షమాపణలు కోరిన ఆల్‌‌రౌండర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 5:33 PM IST
పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ షోకాజ్ నోటీసులు... ‘కాఫీ విత్ కరణ్’ తెచ్చిన తంటా...
‘కాఫీ విత్ కరణ్’ షో పాల్గొన్న సమయంలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 5:33 PM IST
ఆసీస్ టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఓపెనర్ కెఎల్ రాహుల్... గాయం కారణంగా వన్డే సిరీస్ కోసం వచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అనుకోని చిక్కుల్లో చిక్కుకున్నారు. హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొని... రచ్చ రచ్చ చేసిన ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్లు, ఆ షోలో మాట్లాడిన కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే ఫామ్ కోల్పోయి సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ బారిన పడిన ఓపెనర్ కెఎల్ రాహుల్... పాండ్యా చేసిన ఓ చిలిపి వ్యాఖ్య కారణంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ‘టాక్ షో’ రచ్చ ఎంతవరకూ వెళ్లిందంటే... ‘అక్కడ అలా ఎందుకు మాట్లాడారు... మాకు 24 గంటల్లో వివరణ ఇవ్వాలి...’ అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా! ఇంతకీ ఏం జరిగిందంటే... కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహారించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో సహచరుడు కెఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.

ఈ సందర్భంగా మనోడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... ‘మా ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంటా. అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు కూడా వారి దగ్గర ఆ విషయాలు దాచను. నేను ఫస్ట్ టైమ్ సెక్స్ చేసిన సందర్భం కూడా చెప్పాను...’ అంటూ వ్యాఖ్యానించిన హార్ధిక్ పాండ్యా... ‘అమ్మాయిల బ్యాక్ నాకెంతో సెక్సీగా అనిపిస్తుంది. వాళ్ల బ్యాక్ అందాలు చూసేందుకే నేను వెనక నడుస్తూ ఉంటా...’ అంటూ రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు పురుషాహంకారం స్పష్టంగా కనిపించేలా... ‘అది, ఇది, దాన్ని’ అంటూ ఉచ్ఛరిస్తూ మాట్లాడాడు హార్ధిక్ పాండ్యా. దాంతో మహిళా సంఘాల పాటు క్రికెట్ అభిమానులు మనోడి వైఖరిని కామెంట్లతో చీల్చి చెండాడేస్తున్నారు. దాంతో స్పందించిన హార్ధిక్ పాండ్యా... ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.







‘కాఫీ విత్ కరణ్’ షోలో నేను మాట్లాడిన మాటలు ఎవ్వరినైనా బాధపెట్టిఉంటే నన్ను క్షమించండి... నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు. కొంచెం అతి చేశాను...’ అంటూ పేర్కొన్నాడు హార్ధిక్ పాండ్యా. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యాను, అతనితో పాటు టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కెఎల్ రాహుల్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు పంపించింది బీసీసీఐ. 24 గంటల్లో అలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరింది. ఇదే షోలో... ‘సచిన్ టెండుల్కర్ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మెన్’ అంటూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి.
First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు