హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

భయ్యా సన్నీ యాదవ్ .. లగ్జరీ బైక్ కొన్న యూట్యూబ్ సంచలనం..

భయ్యా సన్నీ యాదవ్ .. లగ్జరీ బైక్ కొన్న యూట్యూబ్ సంచలనం..

భయ్యా సన్నీ యాదవ్ (Instagram Photo)

భయ్యా సన్నీ యాదవ్ (Instagram Photo)

Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్.. యూట్యూబ్ సంచలనం ఈ పేరు. తెలుగు నాట బైక్ రైడర్లకు ఆరాధ్య దైవం. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ యువకుడు.. బైక్‌పై దేశ, విదేశాలు తిరుగుతూ, అక్కడి అద్భుత దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాడు.

ఇంకా చదవండి ...

Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్.. యూట్యూబ్ సంచలనం ఈ పేరు. తెలుగు నాట బైక్ రైడర్లకు ఆరాధ్య దైవం. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ యువకుడు.. బైక్‌పై దేశ, విదేశాలు తిరుగుతూ, అక్కడి అద్భుత దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాడు. అవి నచ్చిన వీక్షకులు ఇతడికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ ఈ కుర్రాడి చుట్టూ ఈగల్లా వాలిపోతున్నారు. ఈ మధ్యే నేపాల్, లడ్డాఖ్, రాజస్థాన్ వెళ్లొచ్చి.. ఆ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సన్నీ యాదవ్ ఎప్పుడు ఏ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాడా? అని వేచి చూసే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ యువకుడి ఫాలోయింగ్ ఎంతో.

సన్నీ యాదవ్ గురించి తెలుసుకున్న ఓయో హోటల్స్, పలు హెల్మెట్ బ్రాండ్లు అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. సన్నీ యాదవ్ పేరిట ఓయోలో ప్రోమో కోడ్ అప్లై చేసుకొని 40 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ మధ్యే హైదరాబాద్‌లో KTM adventure 390 బైక్‌ను కూడా లాంఛ్ చేశాడు. తన చేతులతో లాంఛ్ చేయడమే కాదు.. అదే బైక్‌ను కూడా కొన్నాడు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పేరు ఇంటర్నెట్‌లోనే కాదు.. యువతలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

View this post on Instagram

BEST MOMENT IN MY LIFE ❤️PSPK


A post shared by Bayya Sunny Yadav (@bayyasunnyyadav) onPublished by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Bike, Suryapet, Telangana News

ఉత్తమ కథలు