హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: ఓర్ని ఇదేందిరా.. 35 మంది విద్యార్థులను గదిలో బంధించారు.. కారణం ఏంటంటే..

Shocking: ఓర్ని ఇదేందిరా.. 35 మంది విద్యార్థులను గదిలో బంధించారు.. కారణం ఏంటంటే..

స్కూల్ లోని విద్యార్థులు

స్కూల్ లోని విద్యార్థులు

Uttar pradesh: బరేలీలోని ఒక ప్రైవేటు స్కూల్ లో యాజమాన్యం బాలల పట్ల దారుణంగా వ్యవహరించింది. విద్యార్థులను తరగతిలోని ఒక గదిలో బంధించారు. పిల్లలు ఏడుస్తూ.. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తుపై సరైన పునాదులు పడతాయి. విద్యార్థులను ఉపాధ్యాయులు సరైన మార్గంలో నడిపిస్తారు. వారిని నిరంతరం కనిపెట్టుకుని చదువులో వెనుకబడి ఉంటే.. వారిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఆ తర్వాత.. వారిని అన్నిరంగాలలో మంచి పేరు పొందేలా ప్రొత్సహిస్తారు. అయితే, ఇలాంటి పవిత్రమైన స్కూల్ లో విద్యార్థుల పట్ల అమానుషంగా యాజమాన్యం అమానవీయంగా వ్యవహరించింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  రాయ్ బరేలీలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వేధింపుల ఉదంతం వెలుగులోనికి వచ్చింది. తమ స్కూల్ లో ఫీజులు చెల్లించలేదని వారి పిల్లలను పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిలో బంధించారు. సుమారు 35 మంది విద్యార్థులను (Stundents)  తరగతి గదిలో ఒకే తరగతిలో ఉంచారు. దీంతో వారు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై సీరియస్ అయ్యారు. ఘటనపై యాజమాన్యాన్ని నిలదీశారు. స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.

మధ్యప్రదేశ్ లో ఆస్పత్రిలో ఒక తాంత్రికుడు రోగిపై పూజలు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  అశోక్ నగర్ జిల్లాలో దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కచ్చియా బాయి అహిర్వార్ (65) మహిళ ఇటీవల పెళ్ళికి వెళ్లింది. ఆ తర్వాత.. తీవ్ర అస్వస్థకు గురైంది. బాధిత మహిళ కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులకు అక్కడి వారు.. మహిళకు గాలిసోకిందని, తాంత్రిక పూజలు చేస్తేనే కొలుకుంటుందని చెప్పారు. తమకు తెలిసిన తాంత్రికుడు ఉన్నాడని చెప్పారు. దీంతో వారు భయపడిపోయారు. వెంటనే తాంత్రికుడిని రప్పించారు.

డాక్టర్లు లేనిది గమనించి మెల్లగా తాంత్రికుడిని (Tantrik puja) ఆస్పత్రికి రప్పించారు. ఆ తర్వాత.. బెడ్ మీద మహిళ ముందు కూర్చోబేట్టి ఏవో మంత్రాలు చెబుతూ... ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. (Tantrik  Performing Rituals) కొందరు ఈ ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బందిపై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

First published:

Tags: School fees, Students, Uttar pradesh

ఉత్తమ కథలు