ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు యాంత్రికం అయిపోయాయని అంతా అంటుంటారు. కానీ ఎక్కడో జరిగిన ఓ మానవీయ సంఘటనను నెట్‌లో ఎక్కడో చూసినా సరే.. ఆ మనుషులతో మనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా సరే.. మనం ఎందుకో దానికి కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసు సంతృప్తి చెందుతుంది. అవతలి వారు చేసిన పనిని మంచి మనసుతో మెచ్చుకోవాలని అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన ఎమోషనల్ వీడియో (Emotional Video) ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఈ రోజుల్లో క్యాన్సర్(Cancer) సర్వ సాధారణమైన వ్యాధిగా విజృంభిస్తుంది. దీని వైద్యం అత్యంత బాధాకరం. కీమోథెరపీలు, ఆపరేషన్లు అంటూ బాధితులు చాలా రోజుల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలా క్యాన్సర్ ట్రీట్మెంట్లు చేయించుకునేప్పుడు బాధ సంగతి అటుంచితే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంది. దీంతో కొందరు తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు గుండు చేయించుకోవాల్సి వస్తుంది. ఇక మహిళలకైతే ఆ పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంటుంది.
* క్యాన్సర్ బాధితురాలికి మద్దతుగా..
అలాంటి ఓ క్యాన్సర్ బాధిత మహిళ గుండు చేయించుకోవడం కోసం ఓ బార్బర్ షాప్‌కి వచ్చింది. అప్పటికే ఆమె గుండు చేయించుకునేందుకు చాలా బాధగా ఉన్నట్లు కనిపించింది. బార్బర్ ఆమెకు మద్దతుగా నిలుస్తూనే ఆమె జట్టు మొత్తాన్ని షేవ్ చేస్తున్నాడు. దాన్ని అద్దంలో చూసుకుంటున్న ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయింది. దీంతో ఆ బార్బర్ ఆమెను ఓదారుస్తూనే గుండు చేశాడు. చివరిగా ఆమెకు ఓదార్పుతో నిండిన హగ్ ఇచ్చి అద్దంలోకి చూపించాడు. గుండుతో తన ముఖాన్ని చూసుకున్న ఆమెలో బాధ కట్టలు తెంచుకుంది.
No one fights alone! He shaves off his own hair in solidarity with a cancer patient. pic.twitter.com/1sjLKKjnHO
— GoodNewsMovement (@GoodNewsMVT) January 15, 2023
ఈ క్రమంలో బార్బర్ (Barber) ఆమెను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. తాను కూడా జట్టును షేవ్ చేసుకోవడం ప్రారంభించాడు. బార్బర్ గుండు చేసుకోవడాన్ని చూసిన ఆ మహిళకు అది మరింత కష్టంగా అనిపించింది. మరింత ఏడుస్తూ అతనిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అతడు గుండు చేసుకుంటూ ఆమెను మరో చేత్తో ఓదారుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ‘నో ఒన్ ఫైట్స్ ఎలోన్’ క్యాప్షన్‌తో నెట్టింట తిరుగాడుతోంది. వేలల్లో లైకులు, షేర్లు, కామెంట్లను సంపాదించుకుంది. బార్బర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
* నెటిజన్ల రెస్పాన్స్
‘ఈ ప్రేమ కరుణను చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు..’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే మరొకరు ‘కొన్ని సార్లు మనం చేసే చిన్న పనులే పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి’ అంటూ స్పందించారు. ‘ఈ వీడియో చాలా భయానకంగానూ అదే సమయంలో చాలా స్వీట్‌గానూ అనిపించింది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఇలాంటి మంచిని మనం ప్రపంచానికి చూపాల్సి ఉంది. క్యాన్సర్ మనిషిని కుంగదీస్తుంది. ఈ బార్బర్ తన క్లయింట్‌కి ఎంతో కాన్ఫిడెన్స్‌ని ఇచ్చాడు. ఇలాంటి ఫీల్ గుడ్ పోస్ట్‌లు ఇంటర్నెట్‌లో మరిన్ని రావాలి’ అంటూ రాశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, Viral Video