• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BARBER REFUSED TO HAIRCUT AND SHAVING FOR DALITS TWO BROTHERS CAME FORWARD TO DOOR TO DOOR HAIRCUT IN MYSORE HSN GH

Door to Door Haircut: దళితులకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేయబోమన్న బార్బర్లు.. ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఏం చేశారంటే..

Door to Door Haircut: దళితులకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేయబోమన్న బార్బర్లు.. ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఏం చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

దళిత కుటుంబాలకు చెందిన వారికి హెయిర్​ కట్, షేవింగ్ చేయడానికి కర్ణాటకలోని ఒక గ్రామంలోని సెలూన్ల వారు నిరాకరించారు. దీంతో అదే ఊళ్లో ఓ దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు ఏం చేశారంటే..

  • Share this:
ఈ ఆధునిక యుగంలోనూ భారతదేశంలో కుల వివక్ష ఏమాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దళితులపై అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, దళిత కుటుంబాలకు చెందిన వారికి హెయిర్​ కట్​ చేయడానికి కర్ణాటకలోని ఒక గ్రామంలోని సెలూన్ల వారు నిరాకరించారు. దీంతో, అదే దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తమ దళిత కుటుంబాలకు హెయిర్​ కట్​ సేవలను అందించేందుకు ముందుకొచ్చారు. తామే స్వయంగా గ్రామంలోని ప్రతి దళితుడి ఇంటికి వెళ్లి జట్టు కత్తిరింపులు, మంగలి సేవలను అందిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూర్​ కప్పసోగే గ్రామానికి చెందిన దళితులకు హెయిర్​ కటింగ్​ సేవలు అందించేందుకు సెలూన్ షాపుల వారు నిరాకరించారు.

దీంతో, ఆ గ్రామానికి చెందిన దళితులు హెయిర్​ కటింగ్​ కోసం తరచూ ఉల్లాహల్లి లేదా నంజాంగుడ్ పట్టణానికి వెళ్ళవలసి వచ్చేది. తద్వారా, వారు ఆ రోజుకి జీతం కోల్పోవాల్సి వచ్చేది. కాగా, అదే గ్రామానికి చెందిన కెపి మహాదేవ, కెపి సిద్దరాజు అనే ఇద్దరు అన్నదమ్ములకు కూడా ఇదే సమస్య ఎదురైంది. వారికి హెయిర్​ కటింగ్​ చేయడానికి గ్రామంలోని సెలూన్ల వారు నిరాకరించారు. దీంతో, ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తామే స్వయంగా బార్బర్​గా మారాలని నిర్ణయించుకున్నారు. వారే స్వయంగా కత్తెర, రేజర్ పట్టుకొని తమ గ్రామంతో పాటు తమ సమీప గ్రామాలైన కురుహుండి, గౌదరాహుండి, మదనహళ్లికి చెందిన దళిత పురుషులకు హెయిర్ కటింగ్, బార్బర్ సేవలను అందిస్తున్నారు. వారు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని దళిత కుటుంబాల్లో హీరోలయ్యారు.

కరోనాతో ఇంటివద్దకే హెయిర్​ కటింగ్​సేవలు.
దీనిపై ఈ అన్నాదమ్ములు మాట్లాడుతూ.. ‘‘మా కమ్యూనిటీ వారికి హెయిర్​ కటింగ్​ సేవలు నిరాకరించడంతో.. మేమే స్వయంగా బార్బర్లుగా మారాం. దీని ద్వారా మాకు డబ్బు సంపాదించడం కంటే మా కమ్యూనిటీకి సేవ చేస్తున్నామనే ఆత్మ సంతృప్తి లభిస్తుంది. అంతేకాక, ఇది సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడంలో, మాపై వివక్షను రూపుమాపడంలో సహాయపడుతుందని భావిస్తున్నాం.” అని అన్నారు. కాగా, గత ఎనిమిదేళ్ల నుండి ఈ ఇద్దరు అన్నాదమ్ములు బార్బర్​ వృత్తిలోనే ఉన్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందిస్తే దళిత ప్రాంతాల్లో సెలూన్లు తెరిచి సేవలందిస్తామని చెబుతున్నారు. సమాజంలోని కుల వివక్షను తగ్గించడానికి గ్రామంలోని దళిత ప్రాంతాల్లో సెలూన్లు తెరవాల్సిన ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెయిర్​ కటింగ్​ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో స్వయంగా కస్టమర్​ ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నారు. హెయిర్​ కట్​ కోసం రూ .40, షేవ్ కోసం రూ .20 మాత్రమే తీసుకుంటున్నారు. భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఇంకా వివక్షను ఎదుర్కొన్నారు. వారికి బార్బర్​ సేవలు అందించేందుకు సెలూన్ల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అంతేకాక, బావుల నుండి నీరు తోడుకోవడాన్ని కూడా అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారు. గత సంవత్సరం ఇలాగే ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. మైసూరు జిల్లాకు చెందిన ఒక హెయిర్ డ్రస్సర్ దళితులకు హెయిర్​ కట్​ సేవలు అందించినందుకు గాను అగ్రవర్ణాల వారు రూ .50 వేల జరిమానా విధించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ దళితులపై ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతుండటం శోచనీయం.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
Published by:Hasaan Kandula
First published:

అగ్ర కథనాలు