BANK UNIONS CALLED FOR STRIKE ON SEPTEMBER 26 AND 27 BANKING SERVICES WILL EFFECT FOR FOUR DAYS SS
Bank Holidays: బ్యాంకులకు వరుసగా సెలవులు... అప్రమత్తమవండి
ప్రతీకాత్మక చిత్రం
Bank Holidays | సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 మధ్య 7 రోజుల్లో బ్యాంకులు పనిచేసేది 2 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్, చెక్ క్లియరెన్స్, డీడీల జారీ లాంటి సేవలకు బ్రేక్ తప్పదు.
మీరు తరచూ బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే అప్రమత్తంగా ఉండండి. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు మీకు బ్యాంకు సేవలు అందే అవకాశం లేదు. షెడ్యూల్ ప్రకారం సెలవులు ఉండటం మాత్రమే కాకుండా బ్యాంకులు సమ్మెకు పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేస్తూ 4 బ్యాంకులుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సమ్మె జరగనుంది. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులో కార్యకలాపాలు జరిగే అవకాశం లేదు. వీటికి తోడు సెలవులు ఉండటంతో బ్యాంకింగ్ సేవలు వరుసగా నిలిచిపోనున్నాయి.
Bank Holidays: బ్యాంకులు పనిచేయని రోజులు ఇవే...
సెప్టెంబర్ 26, 27: బ్యాంక్ యూనియన్ల రెండు రోజుల సమ్మె
సెప్టెంబర్ 28: నాలుగో శనివారం బ్యాంకుకు సెలవు
సెప్టెంబర్ 29: ఆదివారం బ్యాంకుకు సెలవు
అక్టోబర్ 2: గాంధీ జయంతి
ప్రతీకాత్మక చిత్రం
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 మధ్య 7 రోజుల్లో బ్యాంకులు పనిచేసేది 2 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్, చెక్ క్లియరెన్స్, డీడీల జారీ లాంటి సేవలకు బ్రేక్ తప్పదు. అత్యవసరంగా ఏవైనా లావాదేవీలు ఉంటే సెప్టెంబర్ 25 లోగా ప్లాన్ చేసుకోవడం మంచిది. చెక్కులు జారీ చేసేవాళ్లు బ్యాంకు సెలవుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. కస్టమర్లు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ ట్రాన్స్‌ఫర్స్ చేయొచ్చు. అయితే శనివారం, ఆదివారం ఆర్టీజీఎస్, నెఫ్ట్ పనిచేయవు. ఆ రెండు రోజులు ఐఎంపీఎస్, యూపీఐ సేవల్ని పొందొచ్చు. బ్యాంకు సమ్మె కారణంగా ఏటీఎం సేవలకూ అంతరాయం తప్పదు. అందుకే చేతిలో ఉన్న నగదు ఖర్చు చేయకుండా వీలైనచోట కార్డులు వాడటం మంచిది. లేదా పేటీఎం, ఫోన్‌పే లాంటి వ్యాలెట్స్ ఉపయోగించుకోవచ్చు. బ్యాంకుల సమ్మె ప్రభుత్వ రంగ బ్యాంకులకే పరిమితం. ప్రైవేట్ బ్యాంకుల సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.