BANGLADESH MAN IN LUNGI DENIED MOVIE TICKET CLAIMS VIDEO MULTIPLEX CLARIFIES PAH
మల్టీ ప్లెక్స్ లో సినిమా చూడటానికి పెద్దాయనను రానివ్వలేదు.. కారణం ఏంటంటే..
సమన్ అలీ సర్కార్ (ఫైల్)
Bangladesh: ఒక వ్యక్తి తనకు ఇష్టమైన హీరో సినిమా చూడటానికి వెళ్లాడు. కానీ అక్కడ ఉన్న సినిమా హల్ నిర్వాహకులు అతడి వాలకం చూసి సినిమా టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.
బంగ్లాదేశ్ లోని (Bangladesh) ఢాకాలో ఒక పెద్దాయనకు చేదు అనుభవం ఎదురైంది. సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి ఢాకాలో తన కుటుంబంతో కలిసి లుంగీ వేసుకుని వెళ్లాడు. అయితే.. అక్కడి మల్టీ ప్లేక్స్ నిర్వాహకులు అతడికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. కాగా, బంగ్లాదేశ్‌లోని, ఢాకాలో ఉన్న.. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌లో భాగమైన స్టార్ సినీప్లెక్స్, లుంగీ ధరించి ఉన్నందున ఒక వృద్ధుడికి తన మల్టీప్లెక్స్‌లో టిక్కెట్ నిరాకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. అతడిని సమన్ అలీ సర్కార్ గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం జరిగింది. తాను ఢాకాలోని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లోని స్టార్ సినీప్లెక్స్ థియేటర్‌కి "పోరన్" చూడటానికి వెళ్లానని, అయితే టికెట్ నిరాకరించిందని తెలిపాడు.
అయితే.. దీనిపై సినిప్లెక్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. కస్టమర్ల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని సినీప్లెక్స్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో స్పష్టం చేసింది. స్టార్ సినీప్లెక్స్ ఏదైనా ఒక వ్యక్తి యొక్క వస్త్రధారణ ఆధారంగా కస్టమర్ల పట్ల వివక్ష చూపదని మేము స్పష్టం చేసింది. ఒక వ్యక్తి లుంగీని ధరించడాన్ని ఎంచుకున్నందున టిక్కెట్‌ను కొనుగోలు చేసే హక్కును నిరాకరించే అటువంటి విధానాలు మా సంస్థలో లేవు.
మా సినిమా హాళ్లలో ప్రతి ఒక్కరూ తమ అభిమాన చిత్రాలను అనుభవించడానికి స్వాగతం పలుకుతున్నామని మేము నొక్కిచెప్పాలనుకుంటున్నాము" అని స్టార్ సినీప్లెక్స్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా నీళ్లలో పడిన ట్రక్ ను ఎత్తుతుండగా షాకింగ్ ఘటన జరిగింది.
పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha) షాకింగ్ ఘటన జరిగింది. తాల్చేర్ పట్టణంలో ఒక ట్రక్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడిపోయింది. దీంతోస్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు మరో రెండు క్రేన్ లను అక్కడికి తీసుకొచ్చారు. బ్రిడ్జ్ మీద క్రేన్ లను ఉంచి.. అడుగును పడిపోయిన ట్రక్ కు తాడుతో బిగించిపైకెత్తడానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. క్రేన్ లు.. ట్రక్ ను ఒక్కసారిగా పైకి లాగడానికి ప్రయత్నించాయి.
అప్పుడు ఒక్కసారిగా రేయిలింగ్ తెగిపోయింది. దీంతో బరువంతా.. ఒకే క్రేన్ మీద పడింది. అప్పుడు.. క్రేన్ ఒక్కసారిగా అదే ట్రక్ మీద బోల్తా పడింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. అక్కడున్న వారు... రికార్డు చేసిన వీడియోలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇదేందిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.