హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: ఇద్దరు పెళ్లాలు, 9 మంది పిల్లలు.. సోషల్ మీడియాలో ఇతగాడు తెగ ఫేమస్..

Viral News: ఇద్దరు పెళ్లాలు, 9 మంది పిల్లలు.. సోషల్ మీడియాలో ఇతగాడు తెగ ఫేమస్..

Viral News: ఇద్దరు పెళ్లాలు, 9 మంది పిల్లలు..

Viral News: ఇద్దరు పెళ్లాలు, 9 మంది పిల్లలు..

Viral News: బ్యాంకాక్‌కు చెందిన ఒక వ్యక్తి ఇద్దరు పెళ్లాలతో హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్నాడు. వారితో అతడికి తొమ్మిది మంది సంతానం కూడా కలిగారు. ఇంతకీ ఆ గట్టి పిండం ఎవరు, ఇద్దరు భార్యలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎవరికీ భయపడని చాలామంది మగవాళ్లు, తమ భార్యకు మాత్రం భయపడిపోతుంటారు. కొన్ని సందర్భాలలో భార్యతో వేగలేక సతమతమవుతుంటారు. పెళ్లెందుకు చేసుకున్నాంరా నాయనా అనుకుంటూ తలలు బాదుకుంటుంటారు. అయితే ఒక భార్యతోనే ఇలా అనుకుంటే, బ్యాంకాక్ వ్యక్తి మాత్రం ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అతని పరిస్థితి ఏంటో ఊహించుకొని భార్యా బాధితులు జాలి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ముద్దుల మొగుడు ఇద్దరు పెళ్లాలతో హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్నాడు. వారితో అతడికి తొమ్మిది మంది సంతానం కూడా కలిగారు. ఇంతకీ ఆ గట్టి పిండం ఎవరు, ఇద్దరు భార్యలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నగరానికి చెందిన మనోప్ నత్తయోతిన్ (46) కొన్నేళ్ల క్రితం వారిస్సారా పోక్స్రిచన్ (36), నట్టయా టోంగ్పాన్ (30) అనే ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 2018లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఇద్దరు భార్యలతో కలిసి మనోప్ ఫొటో దిగాడు. ఆ ఫొటోలో ఇద్దరు అందమైన భార్యల మధ్య ముద్దుల మొగుడుగా మనోప్ కనిపించాడు. అతడి భార్య వారిస్సారా ఫేస్‌బుక్‌లో ఈ పిక్ పోస్ట్ చేయగా, ఆ పోస్ట్‌ 6,000 షేర్లతో వైరల్ అయింది.

‘ప్రజలు ఫేస్‌బుక్‌లో తమ భర్తల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే, ఇక నా లైఫ్‌లో నా భర్తకు ఇద్దరు భార్యలు ఉన్నారు! చాలా సంవత్సరాలుగా ఇద్దరు భార్యలను నా భర్త హ్యాండిల్ చేస్తున్నారు. మరో భార్య పట్ల నా మనసును ఎప్పుడూ మార్చుకోలేదు. మా మధ్య ప్రేమ అలాగే ఉంది. కాకపోతే బ్రేస్ట్ సైజులో మాత్రమే మార్పు వచ్చింది.” అని ఫన్నీగా వారిస్సారా ఈ పోస్ట్‌కు ఒక క్యాప్షన్ జోడించారు.

ఈ పోస్టు చాలా తక్కువ సమయంలోనే వైరల్ కావడంతో వారి గురించి దాదాపు థాయ్‌లాండ్ అంతటా తెలిసింది. దాంతో అతని ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీడియా క్యూ కట్టింది. ఆ వ్యక్తి ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తన ఇద్దరు భార్యలను ఒకేసారి హ్యాండిల్ చేస్తున్నానని.. ఇందులో పెద్ద సమస్య ఏం లేదని చెప్పుకొచ్చాడు. ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలతో తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతుందని చెప్పి ఆశ్చర్యపరిచాడు.

తాను దశాబ్ద కాలంగా వారిస్సారతో కలిసి జీవిస్తున్నానని, తర్వాత నట్టయా టోంగ్పాన్‌ను పెళ్లి చేసుకున్నానని మనోప్‌ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అతడికి ముగ్గురు భార్యలు ఉన్నారట. అయితే మూడో భార్య అతనితో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాక చనిపోయారట. మనోప్‌ ఒక్కో భార్యతో కలిసి ముగ్గురు పిల్లలు.. మొత్తం 9 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిస్సా, నట్టయా ఇద్దరూ థాయ్‌లాండ్‌లోని ప్రధాన రేస్ కార్ ఈవెంట్‌లలో కారు విడిభాగాలను విక్రయించే మనోప్ వ్యాపారంలో సహాయం చేస్తారు. ఇద్దరికీ జీతం వస్తుంది కానీ మనోప్ ఎంత అనేది వెల్లడించడానికి ఇష్టపడలేదు.

ఇది కూడా చదవండి : అర్థరాత్రి మొబైల్‌లో గేమ్ ఆడుతున్న చిన్నారి..తండ్రి విధించిన శిక్షకి ఫోన్ అంటేనే విరక్తి!

మనోప్‌పై తమకున్న ప్రేమ అతని డబ్బు వల్ల కలిగింది కాదని, పిల్లలపై తమ భర్త ఎక్కువగా పెట్టుబడి పెడతారని భార్యలు అంటున్నారు. రెండో భార్య వారిస్సారా మాట్లాడుతూ.. "ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, లవ్ చేసుకుంటాం, కేర్ చూపిస్తాం. అందుకే మేం హ్యాపీగా జీవించగలుగుతున్నాం" అని చెప్పారు. ఏదేమైనా ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉంటున్న ఈ భర్తను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

First published:

Tags: Bangkok, International news, Trending news, VIRAL NEWS