Home /News /trending /

BANGALORE LAZY DELIVERY BOY USES DUNZO SERVICES TO DELIVER SWIGGY DELIVERY TO CUSTOMER SK

Swiggy: స్విగ్గీలో కాఫీ ఆర్డర్ చేసిన యువకుడు.. డెలివరీ బాయ్‌కేమో బద్ధకం.. ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Swiggy Delivery: కాఫీని తీసుకున్న తర్వాత.. తన మనసు మారింది. ''అబ్బా.. ఓపిక లేదు.. అంత దూరం వెళ్లి ఇవ్వాలా? '' అని అనుకున్నాడు. బైక్‌పై కస్టమర్‌ ఇంటికి వెళ్లి.. కాఫీ ఇవ్వలేక.. బద్ధకంతో టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు.

    బెంగళూరు నగరం (Bengaluru).. మన దేశంలో టెక్ హబ్. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుంది. ఇక్కడ నివసించే వారిలో చాలా మంది టెక్ కంపెనీల్లో పనిచేస్తుంటారు. స్టార్టప్‌లు కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుంటాయి. అందుకే బెంగళూరు ప్రజలు ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారడపతారు. ఏ పని కావాలన్నా సాంకేతికత సాయం తీసుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వింత ఘటనలు జరగుతుంటాయి. నవ్వులు పూయించే వ్యవహారాలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా బెంగళూరు నుంచి మరో తమషా కథ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి స్విగ్గీ (Swiggy)లో కాఫీ ఆర్డర్ ఇస్తే.. డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలుసా? తాను డెలివరీ చేయకుండా.. బద్ధకంతో మరో యాప్ ద్వారా ఇంకో డెలివరీ బాయ్‌ని నియమించి.. కాఫీని పంపించాడు చేశాడు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుంచి CCD (కేఫ్ కాఫీ డే) అవుట్‌లెట్‌‌లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఓ డెలివరీ బాయ్‌కి వెళ్లింది. అతడు కాఫీని పికప్ చేసుకునేందుకు సీసీడీ (Cafe Coffee Day) అవుట్‌లెట్‌కు వెళ్లాడు. కాఫీని తీసుకున్న తర్వాత.. తన మనసు మారింది. ''అబ్బా.. ఓపిక లేదు.. అంత దూరం వెళ్లి ఇవ్వాలా? '' అని అనుకున్నాడు. బైక్‌పై కస్టమర్‌ ఇంటికి వెళ్లి.. కాఫీ ఇవ్వలేక.. బద్ధకంతో టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. డుంజో (Dunzo) అనే మరో డెలివరీ యాప్‌ ద్వారా ఇంకో డెలివరీ బాయ్‌ని ఎంచుకున్నాడు. అతడు లొకేషన్‌కు రాగానే.. భయ్యా.. ఈ ఆర్డర్‌ని డెలివరీ చేయమని చెప్పి డబ్బులిచ్చాడు. అనంతరం డుంజో డెలివరీ బాయ్ ఆ ఆర్డర్‌ని తీసుకెళ్లి కస్టమర్‌కు అందజేశాడు.

    Cow Urine: రైతులకు శుభవార్త.. పేడతో పాటు గోమూత్రాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది

    కాసేపటి తర్వాత స్విగ్గీ గెలివరీ బాయ్ నుంచి ఆ కస్టమర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆర్డర్‌ని పికప్ చేసుకొని.. డుంజో చేశాను.. ప్లీజ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వమని కోరాడు. కాఫీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తన స్నేహితుడితో దీని గురించి వాట్సప్‌లో చర్చించగా.. ఆ స్క్రీన్‌ షాట్‌ని ఓంకార్ జోషి అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ను ఇప్పటి వరకు దాదాపు ఆరువేల మంది లైక్ చేశారు.



    వాట్సప్ సంభాషణ ఇలా ఉంది.

    ''నేను స్విగ్గీల్లో సీసీడీ నుంచి కాఫీ ఆర్డర్ చేశాను. డెలివరీ బాయ్ దానిని పికప్ చేసుకున్నాడు. కానీ ఇక్కడి దాకా వచ్చి డెలివరీ చేసు ఓపిక అతడికి లేదు. అందుకే కాఫీని డుంజో చేశాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ నాకు కాల్ చేశాడు. భయ్యా.. మీ ఆర్డర్‌ని డుంజోలో పంపించాను. నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండని అడిగాడు.''

    Shocking : భార్య ఫోన్ చూశాడు,అందులో అవి చూసి ఆమెను దారుణంగా చంపేశాడు

    ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. వారెవ్వా.. ఏం తెలివి రా.. అయ్యా ..అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వే డెలివరీ బాయ్ అంటే.. నువ్వు ఇంకో డెలివరీ బాయ్‌ ద్వారా ఆర్డర్ ఇస్తావా? మహానుభావుడివి అని నెటిజన్లు సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. మరి కాఫీ చల్లారిపోయిందా.. ఇంకా వేడిగానే ఉందా ? అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు.








    కాగా, డుంజో కూడా స్విగ్గీ లాంటిదే. డుంజో కూరగాయలు, నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ డెలివరీతో పాటు ఇతర పార్సిల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైనా ప్యాకేజీని ఇచ్చి పలానాా చోట డెలివరీ చేయమని చెబితే..తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ డెలివరీ సర్వీసునే స్విగ్గీ బాయ్ ఉపయోగించుకున్నాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bangalore, Bengaluru, Swiggy, Trending news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు