Pawan Kalyan - Bandla ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్పకళా వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేదికపై వచ్చిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చూపిస్తూ మాటలను తూటాలుగా పేల్చారు. ఇక ఈ నేపథ్యంలోనే నిర్మాత బండ్ల గణేష్ ఈ ఈవెంట్‌కు ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగానే పవన్ కళ్యాణ్‌కు అయన వీరాభిమాని.. సోషల్ మీడియాలోనే పవన్ అంటే తనకు ఎంత ఇష్టమో ఓ రేంజ్లో రాస్తుంటారు. ఇక అలాంటిది పవన్ కళ్యాణ్ ముందు ఉండేసరికి ఆయనకు మాటలు ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం అనేది ఓ రేంజ్ లో చెప్పుకొచ్చాడు.
ఈవెంట్లో బండ్ల గణేష్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. '' ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ పవన్ కళ్యాణ్ నిజంగా ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే చచ్చి బూడిదయ్యే వరకు మనం వదల్లెం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఐపీఎస్ వద్దకు వెళ్లి టెన్త్ క్లాస్ బాగా పాస్ అయ్యారు అన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చూడని బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, చరిత్రలు లేవు.
అయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టారని. ఓ స్నేహితుడు బండ్ల గణేష్‌ను ''మీ బాస్ ఏందిరా ఒకసారి సినిమాలు అంటే మరోసారి రాజకీయాలు అంటాడు అని అడిగాడు. అప్పుడు నేను అతనికి ఒకే మాట చెప్పా.. ఆయనకు మనలా కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, విస్కీ వ్యాపారం లేవు కదా.. ఆయనకి ఉన్నదల్లా బ్లెడ్ వ్యాపారం.. అయన రక్తాన్ని అయన నటనగా మార్చి దాన్ని జనానికి అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పను అని బండ్ల గణేష్ అన్నాడు.
ఇంతటితో ఆగని బండ్ల గణేష్.. ఊరికే ఎవరు గొప్పవాళ్ళు కారు.. ఎందరో పుడుతుంటారు.. చనిపోతుంటారు కానీ కొందరే చరిత్రలో ఉంటారు. రోజుకు అయన 18 గంటలు పని చేస్తూ... 1200 మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ అబద్దం చెప్పి మోసం చెయ్యాలని చూశాను.. కానీ అయన కళ్ళలోకి చూస్తే అలా చేయడం నా వల్ల కాదు.. అయన కళ్ళలో అంతా నిజాయితీ ఉంటుంది..
వెంకన్నకు అన్నమయ్య.. శివుడికి భక్త కన్నప్ప.. రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కు వీరభక్తుడినని సగర్వంగా చెప్పుకుంటున్న అని బండ్ల గణేష్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే బండ్ల గణేష్ ప్రసంగం ఇస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్, దిల్ రాజు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Pawan kalyan, Vakeel saab pre release event