హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బనారస్ వర్సిటీలో ‘భూత వైద్యం’.. దయ్యాలను వదిలించేస్తారు..!

బనారస్ వర్సిటీలో ‘భూత వైద్యం’.. దయ్యాలను వదిలించేస్తారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బనారస్ హిందూ వర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భూత వైద్యం పేరుతో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించేందుకు సిద్ధమైంది.

  దయ్యం పట్టుకుంది.. దయ్యాలను చూశా.. అని చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారిని మానసిక రోగులుగా పరిగణిస్తాం. ఇలాంటి వారిలో దయ్యాలను వదిలిస్తామంటూ కొందరు మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు. అయితే.. ఇలా ప్రవర్తించే వారికి ఎలా చికిత్స అందించాలి? వారిలో మానసిక ప్రశాంతత ఎలా నెలకొల్పాలి? అన్న అంశాలు నేర్పించేందుకు బనారస్ హిందూ వర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భూత వైద్యం పేరుతో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ జనవరి నుంచి కోర్సు ప్రారంభం కానుంది. వర్సిటీలో ఆయుర్వేద కోర్సును బోధిస్తున్న అధ్యాపకులే ఈ కోర్సును బోధించనున్నారు. దాని కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయుర్వేద ఫ్యాక్టరీ యామినీ భూషన్ త్రిపాఠి తెలిపారు.

  ఈ కోర్సులో మానసిక అనారోగ్యం, శరీరం, మెదడుకు మధ్య సంబంధం, శారీరక వ్యాధి.. తదితర అంశాలపై బోధించనున్నారు. శాస్త్రం, నమ్మకాన్ని సమపాళ్లలో ఆదరించే భారత దేశంలో ఇలాంటి కోర్సులు వైద్యులకు మరింతగా ఉపయోగపడతాయని త్రిపాఠి వెల్లడించారు. అయితే.. ఈ కోర్సును ప్రవేశపెట్టడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Doctors, Varanasi

  ఉత్తమ కథలు