HOME »NEWS »TRENDING »banaras hindu university student enters guinness world records with the worlds largest natural color painting krs

అద్భుతం: నేచురల్ కలర్స్​తో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్

అద్భుతం: నేచురల్ కలర్స్​తో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్
Twitter image

నేచురల్ కలర్స్ (Natural colours) తో అద్భుతం సృష్టించారు హిందూ బనారస్ విశ్వవిద్యాలయ విద్యార్థి నేహా సింగ్​. ప్రపంచంలోనే అతి పెద్ద సహజ రంగుల పెయింటింగ్​ (painting)గా అది గిన్నీస్ రికార్డులకెక్కింది.

  • Share this:
    బనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్​ చరిత్ర సృష్టించారు. నేచురల్స్ కలర్స్​ తో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ వేశారు. గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు.

    బనారస్ హిందూ యూనివర్సిటీలో వేదిక్ సైన్స్ చదువుతున్న నేహా సింగ్​ ఈ అద్భుతం సృష్టించారు. సహజ రంగులతోనే ఆమె ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు.



    ఈ విషయంపై బలియా జిల్లా మేజిస్ట్రేట్​ ప్రతాప్ షాహి మాట్లాడారు. “నేచురల్​ కలర్స్​తో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింగ్​ను నేహా సింగ్ వేశారు. మొత్తం 62.72 స్క్వైర్​ మీటర్ల సైజ్ తో ఈ పెయింటింగ్ ఉంది. నేహా పేరు గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో చేరింది. మోక్ష్ కా వృక్ష్ (మోక్ష చెట్లు) పేరిట పేరిట ఈ పెయింటింగ్ వేశారు” అని ఆయన చెప్పారు.

    ఈ ఏడాది నవంబర్​ 18న నేహా ఈ రికార్డు సృష్టించారని గిన్నీస్ వరల్డ్ రికార్డు వెబ్​సైట్ ప్రకటించింది. “ఇండియాకు చెందిన నేహా సింగ్ 62.72 స్వ్రైర్ మీటర్ల అతిపెద్ద స్రైస్ పెయింటింగ్​తో 2020, నవంబర్​ 18న రికార్డు సాధించారు. నేహా ఫైన్ ఆర్ట్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆహార వృథా నేపథ్యంలో ఆమె ఈ పెయింటింగ్ వేశారు” అని వెల్లడించింది.

    బలియాలోని కొత్వారీ గ్రామంలో ఉన్న నేహా ఇంటికి వెళ్లి ఆమెను జిల్లా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అభినందించారు. రికార్డుకు సంబంధించిన సర్టిఫికేట్​ను అందజేశారు.
    Published by:Krishna P
    First published:December 22, 2020, 12:14 IST